ప్రేమించిందని గొంతు నులిమి చంపింది

Woman Strangles Daughter To Death Over Her Relationship - Sakshi

ముంబై : నగరంలో దారుణం జరిగింది. ఓ వ్యక్తిని ప్రేమించిదన్న కోపంతో కన్న కూతురినే గొంతునులిమి చంపింది ఓ కసాయి తల్లి. ఈ ఘటన దక్షిణ ముంబైలోని ఫైడోని ప్రాంతంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పీ. వాఘేలా అనే ఓ 40 ఏళ్ల మహిళ, కూతురు నిర్మలా అశోఖ్‌ వాఘేలా(23)తో కలిసి దక్షిణ ముంబైలోని ఫైడోనిలో నివాసం ఉంటుంది. నిర్మలా ఇటీవల ఓ అబ్బాయితో ప్రేమలో పడింది. ఈ విషయం వాఘేలాకు తెలియడంతో ఆమెతో గొడవకు దిగింది. అతనితో తిరగొద్దని బెదిరించింది. అయినప్పటికీ నిర్మలా అతనితో రిలేషన్‌షిప్‌ను కొనసాగించింది. గత ఆదివారం రాత్రి ఈ విషయంపై తల్లీకూతుర్లకు గొడవ జరిగింది. తల్లితో వాదనలకు దిగిన నిర్మలా.. తాను ప్రేమించిన వాడితోనే వెళ్లిపోతానని తేల్చి చెప్పింది. ఈ క్రమంలో ఇంటి నుంచి బయటకు వెళ్లేందుకు బ్యాగు కూడా సర్దుకుంది. దీంతో కోపోద్రిక్తురాలైన వాఘేలా.. కూతురు గొంతు నులిమి చంపేసింది. అనంతరం​ స్థానిక పోలీసు స్టేషన్‌లో లొంగిపోయింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆమెను అరెస్ట్‌ చేశారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top