భార్యను పంపలేదని.. వదినను చంపిన మరిది | Woman Killed In Adoni | Sakshi
Sakshi News home page

భార్యను పంపలేదని.. వదినను చంపిన మరిది

Jul 28 2019 9:13 AM | Updated on Jul 28 2019 9:13 AM

Woman Killed In Adoni - Sakshi

హత్యకు గురైన భాను 

సాక్షి, ఆదోని టౌన్‌: భార్యను పంపడం లేదని సొంత వదినను మరిదే హత్య చేసిన ఘటన పట్టణంలో శనివారం చోటుచేసుకుంది. త్రీ టౌన్‌ సీఐ శ్రీనివాస్‌ నాయక్‌ తెలిపిన వివరాలు.. పట్టణం లోని పింజరిగేరికి చెందిన గుడుమామీ, షేక్షావలి దంపతులకు భాను(45), జీనత్, రఫీక్‌ సంతానం. భానును బార్‌పేటకు చెందిన షేక్షావలికి ఇచ్చి 40 ఏళ్ల క్రితం వివాహం చేయగా భర్త మృతిచెందడంతో పుట్టినింటిలోనే ఉంటోంది. జీనత్‌ను గోకారి జెండా వీధికి చెందిన కాశీంవలికి ఇచ్చి వివాహం చేశారు. కాగా జీనత్‌ ఇటీవల కాన్పు కోసమని పుట్టినింటికి వచ్చింది. శనివారం తన భార్యను తీసుకెళ్దామని కాశీంవలి రాగా.. ఆరోగ్యం సరిగా లేదని కొంత కాలం ఉంచుకొని పంపుతామని భాను పేర్కొంది.

మాటామాటా పెరిగి వదిన భాను పొట్టలో మరిది కాశీంవలి కత్తితో పొడిచాడు. కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు. విష యం తెలుసుకున్న త్రీ టౌన్‌ సీఐ శ్రీనివాసనాయక్, ఎస్‌ఐ రమేష్, సిబ్బందితో ఆస్పత్రికి చేరుకొని వివరాలు సేకరించా రు. మృతురాలికి నలుగురు కూతుళ్లు, కుమారుడు ఉన్నారు. మృతురాలి కుమారుడు సాబు హుసేన్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని సీఐ తెలిపారు.  

మృతదేహాన్ని పరిశీలించిన డీఎస్పీ 
మరిది కాశీంవలి చేతిలో హత్యకు గురైన భాను మృతదేహాన్ని డీఎస్పీ రామక్రిష్ణ పరిశీలించారు. హత్య ఘటన తెలిసిన వెంటనే ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి చేరుకొని మృతురాలి బంధువులతో మాట్లాడారు. త్వరలోనే నిందితుడు కాశీం వలిని అరెస్ట్‌ చేస్తామని ఆయన తెలిపారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement