హత్యా.. ఆత్మహత్యా..? | Woman Died Suspicious In Nalgonda | Sakshi
Sakshi News home page

హత్యా.. ఆత్మహత్యా..?

Feb 9 2019 8:50 AM | Updated on Feb 9 2019 8:50 AM

Woman Died Suspicious In Nalgonda - Sakshi

సుగుణ మృతదేహం

నల్లగొండ : అనుమానాస్పద స్థితిలో ఓ వివాహిత మహిళ మృతి చెందింది. ఈ ఘటన దేవరకొండ మండల పరిధిలోని గన్యనాయక్‌తండాలో  శుక్రవారం చోటుచేసుకుంది. దేవరకొండ సీఐ వెంకటేశ్వర్లు తెలిపిన వివరాల ప్రకారం.. తండాకు చెందిన సుగుణ(30)కు పాల్త్యతండాకు చెందిన శ్రీనుతో  పదిహేడేళ్ల ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. కాగా ఆరు సంవత్సరాల క్రితం సుగుణ భర్త మృతి చెందాడు. దీంతో సుగుణ తండాలోనే చిన్న కిరాణ దుకాణం నడుపుతూ కుమార్తె, కుమారుడితో జీవనం సాగిస్తోంది.

కాగా, సుగుణకు ఆరేళ్ల క్రితం కొండమల్లేపల్లికి చెందిన వెంకటపతితో ఏర్పడిన పరిచయం వివాహేతర సంబంధానికి దారితీసింది. ఈ క్రమంలో గురువారం తండాకు వచ్చిన వెంకటపతి శుక్రవారం మధ్యాహ్నం సుగుణ(30) ఇంటి నుంచి వెళ్లిపోయాడు. తండాలోనే నివాసం ఉంటున్న సుగుణ తల్లి అస్లి ఇంట్లోకి వెళ్లి చూడగా సుగుణ మృతిచెంది ఉంది. సమాచారం అందుకున్న దేవరకొండ సీఐ వెంకటేశ్వర్లు ఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని దేవరకొండ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతురాలి తల్లి అస్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ పేర్కొన్నారు. ఇదిలా ఉంటే సుగుణది హత్యా.. ఆత్మహత్యా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Advertisement
 
Advertisement
Advertisement