సంక్రాంతికి బట్టలు కొన్న భర్త.. భార్య ఆత్మహత్య

Wife Suicide Due To Fight With Husband Over Sankranti Dresses - Sakshi

సాక్షి, విజయవాడ : సంతోషాలకు నెలవైన సంక్రాంతి పండుగ ఓ కుటుంబంలో విషాదాల్ని నింపింది. భార్య, భర్తల మధ్య దుస్తుల విషయంలో చోటుచేసుకున్న గొడవ ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. విజయవాడ వన్‌టౌన్‌ ఏరియాలో పిళ్ల అశ్విని దంపతులు నివాసముంటున్నారు. ఇంకో రెండురోజుల్లో సంక్రాంతి పండుగ ఉన్నందున ఆమె భర్త కొత్త బట్టలు కొనేందుకు నిశ్చయించుకున్నాడు. ఇందుకోసం భార్య బంగారం తాకట్టు పెట్టి బట్టలు కొన్నాడు. ఈ విషయంపై భార్య, భర్తల మధ్య గొడవ జరిగింది.

తన బంగారు నగలు అమ్మి భర్త దుస్తులు కొనటం, గొడవ కారణంగా ఆగ్రహానికి గురైంది. వెంటనే ఇంటి రెండో అంతస్తు మీదనుంచి కిందకు దూకి ఆత్మహత్య చేసుకుంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్ట్‌ మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.  

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top