పలుగుతో భార్యను పొడిచి చంపాడు | wife murdered by husband | Sakshi
Sakshi News home page

పలుగుతో భార్యను పొడిచి చంపాడు

Dec 25 2017 8:25 AM | Updated on Jul 27 2018 2:21 PM

సాక్షి, పోరుమామిళ్ళ: కడదాకా కలిసి ఉంటానని పెళ్లినాడు బాస చేశాడు.. కానీ నిలబెట్టుకోలేకపోయాడు. ఉన్మాదంతో భార్యను అతి కిరాతకంగా హత్య చేశాడు. ఈ దారుణ సంఘటన వైఎస్సార్ జిల్లా పోరుమామిళ్ల మండలం రామేశ్వరంలో జరిగింది. గ్రామానికి చెందిన వెంకటేశ్వర్లు, గంగమ్మ(45)లు భార్యాభర్తలు. ఇద్దరూ పొలం పనులకు వెళ్లారు. ఇంతలో వారి మధ్య ఏమైందో ఏమో గాని బోరు బావి వద్ద గంగమ్మను గడ్డపారతో పొడిచి వెంకటేశ్వర్లు దారుణంగా హత్య చేశాడు. నిందితుడు పరారీలో ఉన్నాడు. 

Advertisement
 
Advertisement
Advertisement