క్యాష్‌ డిపాజిట్‌ చేస్తానంటూ | Vijayawada Police Arrest A Person Who Targets ATM Centers | Sakshi
Sakshi News home page

ఏటీఎం సెంటర్ల వద్ద చోరీలకు పాల్పడుతున్న వ్యక్తి అరెస్ట్‌

Jun 7 2019 2:52 PM | Updated on Jun 7 2019 3:17 PM

Vijayawada Police Arrest A Person Who Targets ATM Centers - Sakshi

సాక్షి, విజయవాడ : ఏటీఎం సెంటర్లలో చోరికి పాల్పడుతున్న ఇంటిపల్లి రామారావు అనే వ్యక్తిని నగర పోలీసులు శుక్రవారం అరెస్ట్‌ చేశారు. 21 కేసుల్లో నిందితుడిగా ఉన్న ఇతని వద్ద నుంచి రూ. 8,32,700 నగదు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా డీసీపీ రాజకుమారి మాట్లాడుతూ.. క్యాష్‌ డిపాజిట్‌, ఏటీఎం మెషిన్‌ సెంటర్లను కేంద్రంగా చేసుకుని దొంగతనానికి పాల్పడతాడు. క్యాష్‌ తీసుకుని డిపాజిట్‌ చేస్తానని చెప్పి నకిలీ మెసేజులు పంపిస్తాడు. ఆ తరువాత డబ్బు తీసుకుని ఉడాయిస్తాడని తెలిపారు. బయట ఎవరైనా క్యాష్‌ తీసుకుని డిపాజిట్‌ చేస్తామని చెప్తే నమ్మకండని ప్రజలను హెచ్చరించారు. టాస్క్‌ఫోర్స్‌, సీసీఎస్‌ పోలీసులు ఎంతో కష్టపడి కేసును పరిష్కరించారని ఆమె తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement