మితిమీరుతోన్న పైశాచికత్వం..! | Vampirism increasing gradually | Sakshi
Sakshi News home page

మితిమీరుతోన్న పైశాచికత్వం..!

Mar 16 2018 12:00 PM | Updated on Oct 16 2018 3:15 PM

Vampirism increasing gradually - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

మెదక్‌రూరల్‌ : పాతూర్‌ గ్రామానికి చెందిన ఓ పదిహేనేళ్ల బాలికను వరుసకు మామ అయిన అదే గ్రామానికి చెందిన వివాహితుడైన దూరబోయిన కరుణాకర్‌ (25) నాలుగు నెలలుగా అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు కరుణాకర్‌ను రిమాండ్‌ చేశారు. కాగా మంగళవారం రాత్రి ఆ బాలిక తండ్రి మనస్థాపానికి గురై పురుగుల మందు తాగు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.

అసలేం జరిగింది...
బతుకుదెరువుకోసం నిజామాబాద్‌ జిల్లా మెండూరు గ్రామానికి వలసవెళ్లి కొంత కాలం క్రితం స్వగ్రామానికి చేరుకున్నారు. బాలికకు వరుసకు మామ అయిన కరుణాకర్‌ ఇంటికి సరదాగా టీవి చూసేందుకు వెళ్లేది. ఆ క్రమంలోనే బాలిక పై కన్నేసిన కరుణాకర్‌ తన కామవాంఛ తీర్చాల్సిందిగా బాలికను భయబ్రాంతులకు గురిచేశాడు. ఇలా గత నాలుగు నెలలుగా బాలికపై పలుమార్లు అఘాయిత్యానికి పాల్పడ్డాడు.

ఇటీవల బాధిత బాలిక గర్భం దాల్చడంతో తల్లిదండ్రులకు విషయం తెలిసింది. వెంటనే మెదక్‌ పట్టణంలోని ఓ ప్రైవేట్‌ వైద్యురాలిని సంప్రదించడంతో మైనర్‌ బాలిక కావడంతో ఆనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశాలు ఉన్నాయని అబార్షన్‌ చేశారు. ఆ తరువాత కీచక మామపై పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తల్లి ఫిర్యాదు మేరకు మెదక్‌ రూరల్‌ ఎస్‌ఐ లింబాద్రి కరుణాకర్‌ పై నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేసుకొని మంగళవారం రిమాండ్‌కు తరలించారు.

అదే రోజు రాత్రి బాలిక తండ్రి దశరథం కూతురిపై జరిగిన అఘాయిత్యాన్ని జీర్ణించుకోలేక మనస్థాపంతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గమనించిన కుటుంబీకులు వెంటనే మెదక్‌ ఏరియా ఆసుపత్రికి తరలించగా పరిస్థితి విషమించడంతో హైదరాబాద్‌ గాంధీ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం మెదక్‌ డీఎస్పీ వెంకటేశ్వర్లు విచారణ జరుపుతున్నారు.  

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement