మహారాష్ట్ర సచివాలయంలో ఆత్మహత్య | Unemployed man attempts suicide outside Maharashtra secretariat | Sakshi
Sakshi News home page

మహారాష్ట్ర సచివాలయంలో ఆత్మహత్య

Feb 9 2018 3:59 AM | Updated on Oct 8 2018 6:18 PM

Unemployed man attempts suicide outside Maharashtra secretariat - Sakshi

ముంబై: మహారాష్ట్ర మంత్రాలయం (సచివాలయం)లో ఓ వ్యక్తి ఆత్మహత్య సంచలనం సృష్టించింది. ముంబైలోని మంత్రాలయంలో రెండ్రోజుల క్రితం ఓ 32 ఏళ్ల యువకుడు ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన మరువకముందే గురువారం హర్షల్‌ రౌత్‌ (45) అనే వ్యక్తి ఐదో అందస్తునుంచి దూకి ప్రాణాలు తీసుకున్నాడు.

చెల్లి హత్యకేసులో శిక్ష అనుభవిస్తున్న హర్షల్‌ ఇటీవలే పదిరోజుల పెరోల్‌పై బయటకొచ్చాడు. పెరోల్‌ ముగింపునకు ఒకరోజు ముందు (గురువారం సాయంత్రం) సూసైడ్‌ లేఖ రాసి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వెంటనే ఆసుపత్రికి తరలించినా లాభం లేకపోయింది. అయితే లేఖను స్వాధీనం చేసుకున్న పోలీసులు.. అందులోని విషయాలను మాత్రం వెల్లడించలేదు. కాగా, తాజా ఘటనలపై విపక్షపార్టీలు ప్రభుత్వంపై మండిపడ్డాయి. మంత్రాలయం.. ఆత్మహత్యల అడ్డాగా మారిందని విమర్శించాయి.   

Advertisement
 
Advertisement
Advertisement