హనుమాన్‌ ఆలయాన్ని ఢీకొట్టిన బైక్‌ | two Dies In Road Accident | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి

Jun 4 2018 2:08 PM | Updated on Aug 30 2018 4:17 PM

two Dies In Road Accident - Sakshi

సంఘటనా స్థలంలో మృతిచెందిన చిన్మయ పాత్రో 

పర్లాకిమిడి: గుసాని సమితి కత్తలకవిటి గ్రామం వద్ద ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ సంఘటనలో ఇద్దరు మృతి చెందారు. వివరాలు ఇలా ఉన్నాయి. జంగాలపాడు గ్రామం నుంచి మోటార్‌ సైకిల్‌పై బయలుదేరిన ముగ్గురు యువకులు వేగంగా వెళ్తూ కత్తలకవిటి గ్రామం మలుపు వద్ద ఉన్న హనుమాన్‌ మందిరాన్ని ఢీకొట్టారు.

ఈ ప్రమాదంలో డ్రైవింగ్‌ చేస్తున్న చిన్మయపాత్రో(20) సంఘటనా స్థలంలో మృతిచెందాడు. మరో ఇద్దరు తీవ్రగాయాలపాలవడంతో పర్లాకిమిడి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. తీవ్ర గాయాలైన వారిలో ఆర్‌.చందు, మిన్నా నాయక్‌ను మెరుగైన వైద్యం కోసం పర్లాకిమిడి ప్రభుత్వ ఆస్పత్రి నుంచి బరంపురం ఎంకేసీజీ మెడికల్‌ కళాశాల ఆస్పత్రికి తరలించారు.

బరంపురం మెడికల్‌ ఆస్పత్రిలో చికిత్సపొందుతూ మరో వ్యక్తి మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కాగా అతి వేగమే చిన్మయ పాత్రో ప్రాణం తీసిందని సంఘటనా స్థలంలోని గ్రామస్తులు తెలిపారు. గురండి పోలీసులు కేసును నమోదు చేసుకుని విచారిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement