అశ్లీల వీడియోల చిత్రీకరణ

Tution Teacher Video Recording With Students inTamil nadu - Sakshi

టీచర్‌ అరెస్టు

చెన్నై, టీ.నగర్‌: సెక్స్‌ ఎడ్యుకేషన్‌ పేరిట విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తించిన టీచర్, ఆమె ప్రియుడిని బుధవారం పోలీసులు అరెస్టు చేశారు. చెన్నై టీ.నగర్‌ ప్రాంతానికి చెందిన సంజనా (28) డిగ్రీ వరకు చదివి ఇంట్లోనే ట్యూషన్‌ నడుపుతోంది. ఇక్కడ 50 మందికి పైగా విద్యార్థులు చదువుతున్నారు. ఇలావుండగా ట్యూషన్‌లో చదువుతున్న ఓ విద్యార్థిని నీరసంగా, దుస్తులు చెదిరివున్న స్థితిలో మంగళవారం ఇంటికి చేరుకుంది. దీంతో దిగ్భ్రాంతి చెందిన తల్లిదండ్రులు ఆమె వద్ద విచారణ జరిపారు. టీచర్‌ సంజనా, ఆమె బాయ్‌ ఫ్రెండ్‌ బాలాజీ (38) తనను బెదిరించి ఒక విద్యార్థితో పడక గదిలో ఉంచి వీడియో తీసినట్లు తెలిపింది. దీంతో తల్లిదండ్రులు మాంబళం మహిళా పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసుల విచారణలో సెక్స్‌ ఎడ్యుకేషన్‌ పేరిట వీడియోలు తీస్తున్నట్లు గుర్తించారు. దీంతో ఇద్దరిని పోలీసులు అరెస్టు చేసి విచారణ జరుపుతున్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top