విందులో ఘర్షణ..   గొడ్డలితో దాడి | Three Members Injured | Sakshi
Sakshi News home page

విందులో ఘర్షణ..   గొడ్డలితో దాడి

Mar 22 2018 3:53 PM | Updated on Aug 28 2018 7:15 PM

Three Members Injured  - Sakshi

గాయపడ్డ రాజిరెడ్డి

మెట్‌పల్లి (కోరుట్ల) : ఓ విందులో నెలకొన్న గొడవ గొడ్డలితో దాడులు చేసుకునేవరకూ వెళ్లింది. రెండు కుటుంబాలకు చెందిన వ్యక్తులు చిన్న విషయమై మాట మాట పెరిగి గొడ్డళ్లతో దాడి చేసుకోగా.. ముగ్గురు గాయపడ్డారు. పట్టణంలోని గాజులపేటకు చెందిన కాపు సంఘం సభ్యులు బుధవారం శివారులోని ఓ తోటలో విందు ఏర్పాటు చేసుకున్నారు.

దుగ్గి బుచ్చయ్య, హాన్మాండ్లుకు గోనె అశోక్, రాజిరెడ్డి, లక్ష్మణ్‌ మధ్య చిన్న విషయంలో వాగ్వాదం జరిగింది. ఇది గొడవకు దారి తీసింది. హన్మాండ్లు అక్కడే ఉన్న సీసాతో రాజిరెడ్డి తలపై కొట్టడంతో అతడు గాయపడ్డాడు. వెంటనే మిగతా సభ్యులు అడ్డుకుని రాజిరెడ్డిని ప్రభుత్వాసుపత్రికి పంపించారు.

ఆ తర్వాత అక్కడి నుంచి బయటకు వెళ్లిన హన్మాండ్లు కొద్దిసేపటి తర్వాత గొడ్డలితో వచ్చి లక్ష్మణ్, అశోక్‌పై దాడి చేశాడు. ఈ సం ఘటనలో ఇద్దరి తలలకు గాయాలు కావడంతో వారిని కూడా ప్రభుత్వాసుపత్రికి తీసుకువెళ్లారు. లక్ష్మణ్‌ పరిస్థితి విషమంగా ఉండడంతో కరీంనగర్‌లోని ఓ ఆసుపత్రికి తరలిం చారు. దాడి వ్యవహారంపై బాధిత కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

Advertisement
 
Advertisement
Advertisement