బాలికను నమ్మించి గర్భవతిని చేసిన టీచర్‌

Teacher Molestation On Girl In Eluru West Godavari - Sakshi

విషయం తెలుసుకుని దేహశుద్ధి చేసిన స్థానికులు

కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న టూటౌన్‌ పోలీసులు

పశ్చిమగోదావరి, ఏలూరు టౌన్‌:  ఏలూరు నగరంలో ఒక మైనర్‌ బాలికను మాయమాటలతో లోబరుచుకుని ఆమెను గర్భవతిని చేసిన కీచక టీచర్‌ ఉదంతం మంగళవారం రాత్రి వెలుగులోకి వచ్చింది. విషయం తెలుసుకున్న స్థానికులు ఉపాధ్యాయునికి దేహశుద్ధి చేశారు. రోడ్డుపై నగ్నం నడిపిస్తూ.. చితకొట్టి ఏలూరు టూటౌన్‌ పోలీసులకు అప్పగించారు. అనంతరం బాలిక తల్లీదండ్రీ ఏలూరు టూటౌన్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. బాలిక ఏలూరు టూటౌన్‌ ప్రాంతంలోని ఒక పాఠశాలలో చదివే సమయంలో అక్కడ ఇంగ్లిష్‌ టీచర్‌గా కె.రాంబాబు పనిచేశాడు. అప్పట్లో మార్కులు బాగా వేయిస్తానని నమ్మబలికి బాలికను లోబరుచుకున్నాడు.

గత కొంతకాలంగా బాలికతో సన్నిహితంగా ఉంటూ ఆమెను శారీరంగా వాడుకున్నాడనీ అంటున్నారు. అయితే ప్రస్తుతం బాలిక పాలిటెక్నిక్‌ చదువుతోంది. బాలిక ఐదు నెలల గర్భిణి కావటంతో విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాంబాబు స్వస్థలం కర్నూలు జిల్లా కాగా అతనికి పదేళ్ళ క్రితమే వివాహం అయ్యింది. భార్య రాంబాబును వదిలివేయటంతో ఏలూరులోనే గత 7 సంవత్సరాలుగా ఒక ప్రైవేటు పాఠశాలలో టీచర్‌గా పనిచేస్తున్నాడు. బాలికను మోసం చేసి లోబరుచుకుని గర్భవతిని చేశాడని బాలిక బంధువులు చెబుతున్నారు. స్థానికులు రాంబాబును బట్టలు ఊడదీసి తీవ్రస్థాయిలో కొట్టటంతో అతనికి తీవ్ర గాయాలయ్యాయి.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top