ఆటో బోల్తా : విద్యార్థులకు గాయాలు

Students Injured in Auto Roll Overed in Anantapur - Sakshi

అనంతపురం, మడకశిరరూరల్‌: ఉప్పిడిపల్లి  సమీపంలో ప్రధాన రోడ్డుపై గురువారం ఉదయం ప్రమాదవశాత్తు అటో బోల్తా పడడంతో   10 మంది విద్యార్థులకు స్వల్పంగా గాయాలయ్యాయి. వివరాలిలా ఉన్నాయి.. మణూరు పంచాయితీలోని వివిధ గ్రామాల విద్యార్థులు మడకశిరలోని ప్రభుత్వ, ప్రవేట్‌ కళాశాలలకు అటోలో బయలుదేరారు. ఉప్పిడిపల్లి సమీపంలో ఉన్నఫళంగా అటో అదుపు తప్పి బోల్తా పడడంతో విద్యార్థులకు గాయాలయ్యాయి. వెంటనే వారిని మడకశిర ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇదిలా ఉండగా మణూరు పంచాయితీలోని వివిధ గ్రామాలను దాదాపు 40 మంది విద్యార్థులు రోజూ కళాశాలలకు వస్తుంటారు. బస్సు సౌకర్యం లేకపోవడంతో గత్యంతరం లేక ఆటోలను ఆశ్రయిస్తున్నారు. ఆటోల్లో ప్రయాణం ప్రమాదకరంగా మారిందని, అర్టీసీ అధికారులు బస్సు ఏర్పాటు చేయాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top