క్షణికావేశంతోనే ఆత్మహత్య.. | student suicide with love affair | Sakshi
Sakshi News home page

క్షణికావేశంతోనే ఆత్మహత్య..

Feb 20 2018 8:08 AM | Updated on Nov 9 2018 4:36 PM

student suicide with love affair - Sakshi

అనీషా (ఫైల్‌)

కుత్బుల్లాపూర్‌: క్షణికావేశంతోనే తన స్నేహితుడితో వీడియో కాల్‌ మాట్లాడుతూ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుందని పోలీసులు నిర్ధారించారు. పేట్‌ బషీరాబాద్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఆదివారం కలకలం రేపిన ఏంబిఏ విద్యార్థిని ఆత్మహత్యపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. అనంతపురం జిల్లాకు చెందిన జగ్గయ్య చౌదరి, కుమార్తె అనీషా చౌదరి (23) కొంపల్లిలోని శివశివానీ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌లో ఎంబీఏ ద్వితీయ సంవత్సరం చదువుతూ కాలేజీ హాస్టల్‌ లో ఉంటుంది. అదే కాలేజీలో చదువుతున్న మేడ్చల్‌ గ్రామానికి చెందిన దీక్షేశ్‌ పటేల్‌తో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది.

ఇదిలా ఉండగా ఈ నెల 26న జరగనున్న తన స్నేహితుడి పెళ్లికి వెళ్లేందుకు సిద్ధమైంది. ఈ విషయమై ఇద్దరి మధ్య విబేధాలు తలెత్తాయి. ఈ నేపథ్యంలో 16 నుంచి 17వ తేది అర్ధరాత్రి వరకు చాటింగ్‌ ద్వారా మాటల యుద్దం నడిచింది. రెండు రోజుల వ్యవధిలో 320 కు పైగా మెసెజ్‌లు అనీషాచౌదరి ఫోన్‌లో నిక్షిప్తమై ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. దీంతో మాటా మాటా పెరిగి తననే అనుమానిస్తున్నావా అంటూ .ప్రియుడు దీక్షేశ్‌ కు వీడియో కాల్‌ చేసి ఆత్మహత్య చేసుకున్నట్లు గుర్తించారు. కేసును దర్యాప్తు చేస్తున్న ఎస్సై వెంకటేశ్‌ అనీషా స్నేహితురాలి లాప్‌ట్యాప్‌తో పాటు అనీషా ఫోన్‌ను స్వాధీనం చేసుకుని పరిశీలించగా మెసెజ్‌ల ద్వారా కోపాన్ని ప్రదర్శించినట్లు గుర్తించారు. దీక్షేశ్‌ను విచారించి వదిలేశారు. 

Advertisement
 
Advertisement
Advertisement