లెక్కలు రావడంలేదని..

student committed to suicide with maths fear - Sakshi

సాక్షి, చల్లపల్లి: గణితం, విద్యార్థులకో అదో పెద్ద చిక్కులెక్క. అర్థం అయిన వారికి ఇది చాలా ఈజీ అంటారు. అర్థం కాని వాళ్లు మాత్రం తలలు పట్టుకుంటారు. అలా లెక్కలు రావడం లేదని ఓ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడింది. కృష్ణాజిల్లా చల్లపల్లి మండలం ఉల్లిపాలెంకు చెందిన పాలంకి సరిత(13) స్వతంత్రపురం హైస్కూల్‌లో 9వ తరగతి చదువుతున్నది. బాలిక తల్లిదండ్రులు గతంలోనే చనిపోవడంతో మేనమామ రాధాకృష్ణ ఆమెను చదివిస్తున్నారు.

సరిత గణితంలో వెనుకబడి ఉండేది. లెక్కలు రావడం లేదని ఆందోళన చెందిన ఇంటి దగ్గర పొలానికి చల్లే విష గుళికలు తిని తరగతికి వచ్చింది. నీరసంగా ఉండడంతో వెనుక బెంచిలో కూర్చోబెట్టారు. కొద్దిసేపటికి నోటి నుంచి నురుగు వస్తుండడంతో వెంటనే కోడూరు పీహెచ్‌సీకి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం అవనిగడ్డ వైద్యశాలకు తరలిస్తుండగా మార్గంమధ్యలో ప్రాణాలు విడిచింది.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top