భర్త స్నేహితుడే హతమార్చాడు | Soumya Murder Case Revealed | Sakshi
Sakshi News home page

భర్త స్నేహితుడే హతమార్చాడు

Apr 7 2018 1:09 PM | Updated on Apr 7 2018 1:09 PM

Soumya Murder Case Revealed - Sakshi

వివరాలు సేకరిస్తున్న పోలీసులు, సౌమ్య (ఫైల్‌)

సనత్‌నగర్‌:  ఎర్రగడ్డ ప్రాంతంలోని ఓ అపార్ట్‌మెంట్‌లో జరిగిన సౌమ్య హత్య కేసులో మిస్టరీ వీడింది. మృతురాలు సౌమ్య భర్త నాగభూషణం స్నేహితుడే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు నిర్దారించారు. నందనగర్, సూరజ్‌ ఆర్కేడ్‌ అపార్ట్‌మెంట్, 104 ప్లాట్‌లో నివసించే మెట్రో ఎల్‌ అండ్‌ టీ సివిల్‌ ఇంజనీర్‌ అయిన నాగభూషణం భార్య సౌమ్య సోమవారం అర్ధరాత్రి దారుణ హత్యకు గురైన విషయం విదితమే. కత్తితో పొడిచిన దుండగుడు ఆమెపై నూనె పోసి నిప్పటించి గది బయట గడియపెట్టి పరారయ్యాడు.

దీనిపై దర్యాప్తు చేపట్టిన ఎస్‌ఆర్‌నగర్‌ పోలీసులు, టాస్క్‌ఫోర్స్, సీసీఎస్, క్లూస్‌ టీం బృందాలు నాగభూషణం స్నేహితుడు, అతని సహోద్యోగి  అనంతపురంకు చెందిన ప్రకాష్‌ను నిందితుడిగా గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. నాగభూషణం  మెట్రోలో చేరకముందు అస్సోంలో నాలుగేళ్ల పాటు పనిచేశాడు. ఈ సమయంలో ప్రకాష్‌ పరిచయం ఏర్పడింది. ఈ నేపథ్యంలో ప్రకాష్‌ తరుచూ నాగభూషణం ఇంటికి వచ్చిపోతుండేవాడు. హత్య జరిగిన రోజు కూడా నాగభూషణం, ప్రకాష్‌ కలిసి మద్యం సేవించడమేగాక కలిసి భోంచేశారు. అనంతరం ఇద్దరూ బయటికి వెళ్లిపోయారు. అర్ధరాత్రి మళ్లీ ఇంటికి తిరిగి వచ్చిన ప్రకాష్‌ సౌమ్యను హత్య చేసి పరారయ్యాడు. అయితే హత్యకు దారి తీసిన పరిస్థితులపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement