కరోనాతో ఆస్పత్రికి.. ఇంటి కొచ్చి చూస్తే.. | Robbery In Coronavirus Patient House In Hyderabad | Sakshi
Sakshi News home page

కరోనా బాధితుడి ఇంట్లో చోరీ

Jun 4 2020 2:00 PM | Updated on Jun 4 2020 4:31 PM

Robbery In Coronavirus Patient House In Hyderabad - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, హైదరాబాద్‌ : కరోనా వైరస్‌ బాధితుడి ఇంటికి కన్నం వేశారు దొంగలు. ఈ సంఘటన అల్వాల్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే.. అల్వాల్‌ ప్రగతి శీల కాలనీకి చెందిన వంశీకృష్ణ ఓ ప్రైవేట్‌ కంపెనీలో పనిచేస్తున్నారు. అతడికి కరోనా వైరస్‌ సోకడంతో గత నెల 11వ తేదీన  గాంధీ ఆసుపత్రికి తరలించారు. అతనితో పాటు భార్య, పిల్లల్ని సైతం ప్రభుత్వ క్వారంటైన్‌లో ఉంచారు. వారు పూర్తిగా కోలుకున్న తర్వాత ఇంటికి తిరిగివచ్చారు. ఇంటి తలుపులు తెరిచి ఉండటంతో అవాక్కయ్యారు. వెంటనే లోపలికి వెళ్లి చూసే సరికి పరిస్థితి అర్థం అయిపోయింది. ఇంట్లో దొంగలు పడి దోచారని గుర్తించి, పోలీసులకు ఫిర్యాదు చేశారు. పది తులాల బంగారు ఆభరణాలు 30 వేల రూపాయల నగదు చోరీకి గురైనట్లు బాధితులు తెలిపారు. చదవండి : పాజిటివ్‌ వచ్చిన జర్నలిస్టులకు ఆర్థికసాయం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement