పాజిటివ్‌ వచ్చిన జర్నలిస్టులకు ఆర్థికసాయం | Financial Help For Coronavirus Positive Journalists Hyderabad | Sakshi
Sakshi News home page

పాజిటివ్‌ వచ్చిన జర్నలిస్టులకు ఆర్థికసాయం

Jun 4 2020 11:00 AM | Updated on Jun 4 2020 11:00 AM

Financial Help For Coronavirus Positive Journalists Hyderabad - Sakshi

నాంపల్లి: నగరంలో కరోనా పాజిటివ్‌ వచ్చిన ముగ్గురు జర్నలిస్టులకు ఒక్కొక్కరికి రూ.20 వేల  చొప్పున ఆర్థికసాయం అందించనున్నట్లు  తెలంగాణ ప్రెస్‌ అకాడమి చైర్మన్‌ అల్లం నారాయణ ప్రకటించారు. మహబూబ్‌నగర్‌  జిల్లాలో హోం క్వారంటైన్‌లో ఉన్న ఇద్దరు జర్నలిస్టులకు ఒక్కొక్కరికి రూ.10 వేల చొప్పున  ఆర్థిక సహాయం అందించనున్నామన్నారు.ఇప్పటి వరకు కరోనా పాజిటివ్‌లు వచ్చిన ఢిల్లీ, జోగులాంబ గద్వాల్, హైదరాబాద్‌లకు చెందిన 10 మంది జర్నలిస్టులకు రూ.20 వేల చొప్పు, జోగులాంబ గద్వాల్, మహాబూబ్‌నగర్‌ జిల్లాలో కరోనా కారణంగా క్వారంటైన్‌లో ఉన్న 11 మంది జర్నలిస్టులకు రూ.10 వేల చొప్పున ఇప్పటి   మొత్తం రూ.3,10 లక్షల రూపాయలను అకాడమి నిధుల నుండి అందించామని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement