గుంటూరులో ఘోర రోడ్డు ప్రమాదం | Road Accident At Guntur | Sakshi
Sakshi News home page

గుంటూరులో ఘోర రోడ్డు ప్రమాదం

Feb 10 2020 11:30 AM | Updated on Feb 10 2020 12:16 PM

Road Accident At Guntur - Sakshi

సాక్షి, గుంటూరు : జిల్లాలోని ఫిరంగిపురం మండలం రేపుడి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటోను లారీ ఢీకొన్న ఘటనలో ఆరుగురు మృతి చెందగా, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుల్లో ఇద్దరు మహిళలు, ఒక పసికందు ఉన్నారు. నర్సారావు పేట నుంచి పుట్టకోట గ్రామానికి వెళ్తున్న ఆటోను ఎదురుగా వస్తున్న లారీ ఢీకొనడంతో ఈ ఘోరం జరిగింది. ఈ ఘటనలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఇద్దరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. వీరంతా కూడా నర్సరావుపేట సమీపంలోని ఓ గ్రామంలో జరిగిన శుభకార్యంలో పాల్గొని తిరిగి వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. మృతుల్లో ముగ్గురిని పుట్టకోట గ్రామానికి చెందిన రమాదేవి, మణికంఠ, యశస్వినిగా గుర్తించారు. మరో ముగ్గురి వివరాలు తెలియాల్సి ఉంది. ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.




Advertisement
 
Advertisement
Advertisement