రైల్వే వెబ్‌సైట్‌ హ్యాకర్‌ అరెస్టు  | Railway Website Hacker Arrested | Sakshi
Sakshi News home page

రైల్వే వెబ్‌సైట్‌ హ్యాకర్‌ అరెస్టు 

Jun 26 2018 9:57 AM | Updated on Aug 20 2018 4:48 PM

Railway Website Hacker Arrested - Sakshi

నిందితుడు బాలకృష్ణతో రైల్వే పోలీసులు 

కాశీబుగ్గ : రైల్వే టికెట్‌ వెబ్‌సైట్‌ను హ్యాక్‌ చేసి 35 నకిలీ ఐడీలతో టికెట్లు పొందుతున్న వ్యక్తిని పలాస రైల్వే పోలీసులు అరెస్టు చేశారు. పలాస పురుషోత్తపురం గ్రామానికి చెందిన పత్తి బాలకృష్ణ(36) తప్పుడు మార్గాల్లో టికెట్లు పొందుతుండగా ఆదివారం పోలీసులు అరెస్టు చేశారు.

తొమ్మిది మంది పేరుతో తీసుకున్న రిజర్వేషన్‌ టికెట్లు, ఖాళీ రిజర్వేషన్‌ పత్రాలు, రెండు సెల్‌ఫోన్‌లు, రూ.8270 నగదును స్వాధీనం చేసుకున్నారు. ఆర్‌పీఎఫ్‌ ఇన్‌స్పెక్టర్‌ డి.కుమార్‌ నిందితుడిపై రైల్వే సెక్షన్‌ 143 కింద కేసు నమోదు చేశారు. సోమవారం ఉదయం విలేకరుల ముందు ప్రవేశపెట్టి విశాఖపట్నం సెకెండ్‌ క్లాస్‌(ఎంఎం) రైల్వేకోర్టుకు జ్యుడీషియల్‌ రిమాండ్‌ నిమిత్తం తరలించారు.

Advertisement
 
Advertisement
Advertisement