తమిళ పవర్‌స్టార్‌ అదృశ్యం

Power Star Srinivasan Missing In Tamil Nadu - Sakshi

చెన్నై, పెరంబూరు: నటుడు పవర్‌స్టార్‌ శ్రీనివాసన్‌ గురువారం అనూహ్యంగా కనిపించకుండాపోయారు. దీంతో భార్య అన్నానగర్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. లత్తికా అనే చిత్రం ద్వారా నటుడిగా, నిర్మాతగా సినీరంగానికి పరిచయం అయ్యారు. సంతానం హీరోగా నటించిన కన్నా లడ్డు తిన్న ఆశైయా చిత్రంలో ఆయనకు స్నేహితుడిగా హాస్య పాత్రలో నటించి గుర్తింపు పొందారు. ఆ తరువాత పలు చిత్రాల్లో వివిధ రకాల పాత్రల్లో నటిస్తున్నారు. పవర్‌స్టార్‌ శ్రీనివాసన్‌పై పలు ఆర్థికమోసాల కేసులు ఉన్నాయి. ఈయన ఒక కేసులో అరెస్టయి తీహార్‌ జైలుకు వెళ్లొచ్చారు కూడా. కాగా గురువారం సాయంత్రం పవర్‌స్టార్‌ శ్రీనివాసన్‌ భార్య లూసీ తన భర్త కనిపించకుండా పోయారని స్థానిక అన్నానగర్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

అందుంలో శుక్రవారం ఉదయం తన భర్త మిత్రుడి ఇంటికి వెళ్లొస్తానని చెప్పి వెళ్లారని, ఆ తరువాత ఇంటికి తిరిగి రాలేదని పేర్కొన్నారు. ఎవరో గుర్తు తెలియని కొందరు తనకు ఫోన్‌ చేసి నీ భర్త పేరు మీద ఉన్న ఆస్తులన్నీ తమ పేరుకు రాయాలని డిమాండ్‌ చేసినట్లు తెలిపారు. తన భర్తను కనుగొని తనకు అప్పగించాల్సిందిగా లూసీ ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దార్యాప్తు చేస్తున్నారు. పోలీసుల దర్యాప్తులో నటుడు పవర్‌స్టార్‌ శ్రీనివాసన్‌ ఊటీలో ఉన్నట్లు తెలిసిందట. ఆయనకు ఊటీలో ఒక బంగ్లా ఉందది, ఆర్థిక సమస్యల కారణంగా ఆ బంగ్లాను అమ్మడానికి శ్రీనివాసన్‌ ఊటీకి వెళ్లినట్లు పోలీసుల సమాచారం.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top