టీడీపీ నేతల అక్రమ మద్యం వ్యాపారం బట్టబయలు | Police Seized Illegal Liquor From Narasaraopet TDP Leader | Sakshi
Sakshi News home page

టీడీపీ నేతల అక్రమ మద్యం వ్యాపారం బట్టబయలు

Jan 30 2020 7:24 PM | Updated on Jan 30 2020 7:32 PM

Police Seized Illegal Liquor From Narasaraopet TDP Leader - Sakshi

సాక్షి, గుంటూరు/ ప్రకాశం : టీడీపీ నేతలు సాగిస్తున్న అక్రమం మద్యం వ్యాపారం బట్టబయలు అయింది. జిల్లాలోని నరసరావుపేట మండలం చింతలపాలెంలో కోళ్లఫారం కేంద్రంగా సాగిస్తున్న అక్రమ మద్యం దందాను పోలీసులు రట్టు చేశారు. సోదాల్లో మూడు వేల మద్యం సీసాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. టీడీపీ నేత కడియం కోటిసుబ్బారావు కర్ణాటక నుంచి అక్రమంగా మద్యం తెచ్చి.. ఇక్కడ దందా సాగిస్తున్నట్టుగా పోలీసులు గుర్తించారు. 

మరోవైపు ప్రకాశం జిల్లా ఒంగోలులోని మంగమూరు డొంకలో ఓ నివాసంలో భారీగా అక్రమ మద్యాన్ని విక్రయిస్తున్న సుంకర్‌ హరిబాబును ఎక్సైజ్‌ అధికారులు అరెస్ట్‌ చేశారు. స్థానిక అంజయ్య రోడ్డులోని ప్రభుత్వ మద్యం దుకాణంలో పనిచేస్తున్న సూపర్‌ వైజర్‌ సుబ్రహ్మణ్య మద్యం కేసులను హరిబాబుకు సరఫరా చేస్తున్నట్టు పోలీలసు గుర్తించారు. సూపర్‌ వైజర్‌ను కూడా అరెస్ట్‌ చేసి విచారణ చేపట్టారు. ప్రభుత్వ మద్యం దుకాణాల నుంచి అక్రమంగా సేకరించిన మద్యాన్ని.. నకిలీ బ్రాండ్ల పేరుతో నీటిని మద్యాన్ని కలిపి విక్రయాలు సాగిస్తున్నట్టు ఎక్సైజ్‌ అధికారులు వెల్లడించారు. అలాగే హరిబాబు వద్దనున్న సుమారు 70 మద్యం బాటిళ్లు, 1600 లేబుల్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement