12 మంది క్రికెట్‌ బెట్టింగ్‌ రాయుళ్ల అరెస్ట్‌ | Police Attack On Cricket Betting Centre | Sakshi
Sakshi News home page

12 మంది క్రికెట్‌ బెట్టింగ్‌ రాయుళ్ల అరెస్ట్‌

May 4 2018 9:34 AM | Updated on Aug 21 2018 6:12 PM

Police Attack On Cricket Betting Centre - Sakshi

క్రికెట్‌ బెట్టింగ్‌ వివరాలను వెల్లడిస్తున్న కదిరి డీఎస్పీ శ్రీలక్ష్మీ

కదిరి: కదిరిలో క్రికెట్‌ బెట్టింగ్‌ స్థావరంపై బుధవారం రాత్రి పోలీసులు మెరుపు దాడి చేశారు. 12 మందిని అరెస్ట్‌ చేయడంతో పాటు వారి నుండి రూ. 6 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. అయితే మరో ఆరుగురు పోలీసులు వస్తున్న సమాచారం తెలుసుకొని పరారయ్యారు. ఇందుకు సంబంధించిన వివరాలను కదిరి డీఎస్పీ శ్రీలక్ష్మి గురువారం పట్టణ సీఐ కార్యాలయం వద్ద మీడియాకు వివరించడంతో పాటు బెట్టింగ్‌ రాయుళ్లను మీడియా ముందు ప్రవేశపెట్టారు. పరారీలో ఉన్న వారిని కూడా త్వరలోనే అరెస్ట్‌ చేస్తామన్నారు. కదిరి సబ్‌ డివిజన్‌ పరిధిలో ఎక్కడైనా అసాంఘిక కార్యకలాపాలు జరుగుతుంటే వెంటనే తమకు సమాచారం ఇవ్వాలని ప్రజలకు సూచించారు. సమాచారం ఇచ్చిన వారి పేరును కూడా గోప్యంగా ఉంచుతామన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement