లలిత జ్యువెల్లర్స్‌లో చోరీ: నిందితుల అరెస్ట్‌ | police arrests in lalita jewellers theft case | Sakshi
Sakshi News home page

Dec 18 2017 6:56 PM | Updated on Aug 20 2018 4:37 PM

హైదరాబాద్‌: లలితా జ్యువెల్లరీ షాపులో దొంగతనం కేసులో పోలీసులు పురోగతి సాధించారు. అక్టోబర్‌లో జరిగిన ఈ దొంగతనం కేసులో ఇద్దరిని పంజాగుట్ట పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. కృష్ణాజిల్లా నందిగామకు చెందిన షేక్‌ కరీముల్లా(27) సికింద్రాబాద్‌లోని సింధి కాలనీలో ఓ బాయ్స్‌ హాస్టల్‌లో ఉంటున్నాడు. అతనికి అదే కాలనీలో గర్ల్స్‌ హాస్టల్‌లో ఉంటున్న కర్నూలు జిల్లాకు చెందిన వాణి క్రాంతి(26) అనే గర్ల్‌ఫ్రెండ్‌ ఉంది. వీరు ఉద్యోగం కోసం వెతుకులాటలో ఉన్నారు. ఈ క్రమంలో అక్టోబర్‌లో సోమాజిగూడలోని లలితా జ్యువెల్లర్స్‌కు వెళ్లి అక్కడ ఎవరూ గమనించకుండా బంగారపు గాజులు, బ్రేస్‌లెట్‌ను దొంగిలించారు. వీటిని కరీముల్లా పేరుతో రూ.1.20 లక్షలకు నందిగామలోని ముత్తూట్‌ ఫైనాన్స్‌లో తాకట్టుపెట్టారు. జ్యువెల్లర్స్‌ యాజమాన్యం ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టి నిందితులను అరెస్టు చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement