ఉద్యోగం రాలేదని దివ్యాంగుడి ఆత్మహత్య | Physically handicaped suicide | Sakshi
Sakshi News home page

ఉద్యోగం రాలేదని దివ్యాంగుడి ఆత్మహత్య

Mar 7 2018 2:35 AM | Updated on Mar 7 2018 2:35 AM

Physically handicaped suicide - Sakshi

హైదరాబాద్‌: ఉద్యోగం రాలేదని మనస్తాపం చెందిన ఓ దివ్యాంగుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నల్లగొండ జిల్లా మర్రిగూడెం మండలం కోదాశపల్లికి చెందిన బి.మహేందర్‌(28) వనస్థలిపురం పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని మెడికేర్‌ ఆస్పత్రి సమీపంలోని దివ్యాంగుల వసతి గృహంలో పదేళ్లుగా ఉంటూ ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేసుకుంటున్నాడు.

ప్రభుత్వోద్యోగం వచ్చాక పెళ్లి చేసుకుందామనుకున్న ఆ యువకుడి యత్నాలు తరచూ విఫలమ వుతుండటంతో మనస్తాపానికి గురై మంగళవారం ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఎంతకూ తలుపు తీయకపోవడంతో తోటి విద్యార్థులు కిటికీలో నుంచి చూడగా మహేందర్‌ ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement