
వివిధ సామాజిక మాధ్యమాలు, ప్రసార సాధనాల ద్వారా రోష్నీ అనేకమంది బాధితులకు చేరువయ్యింది. 1997లో నలుగురితో ప్రారంభమైన సంస్థ ప్రస్తుతం 70 మంది సుశిక్షితులైన వాలంటీర్లతో నిత్యం కౌన్సెలింగ్ ఇస్తూ అనేక మందికి అందగా నిలుస్తోంది.
వీధినాటకాలు, కరపత్రాలు, ప్లకార్డుల ప్రదర్శనలతో 28 ఏళ్లుగా వేలాది మందికి అండగా.. ప్రజల్లో అవగాహన కల్పిస్తోంది. పూర్తిగా డిప్రెషన్‌లోకి వెళ్లిన వారి కోసం సైకాలజిస్టులు, సైక్రియాట్రిస్టులతో మానసిక చికిత్స, ఉచితంగా మందులు అందిస్తోంది. ప్రతి శుక్రవారం రామకృష్ణ మఠంలో సెషన్స్ నిర్వహిస్తోంది. 040–6620 2000, 040–6620 2001 రోష్నీ కౌన్సెలింగ్ సెంటర్ టోల్‌ఫ్రీ.
పురుషులే ఎక్కువ..
నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో 2023 ప్రకారం.. ప్రపంచ వ్యాప్తంగా ఆత్మహత్యకు పాల్పడుతున్నవారిలో పురుషులే అధికంగా ఉన్నారు. ప్రతి 40 సెకన్లకు ఒకరు చొప్పున ఏటా 8 లక్షల మంది, ఒక్క భారత్‌లోనే మూడు నిమిషాలకు ఒకరు చొప్పున యేడాదికి 1.71 లక్షల మంది, రోజుకు 512 మంది ఆత్మహత్యలు చేసికుంటున్నారు. ఏపీ, తెలంగాణలో ప్రతి రోజు 6 నుంచి 8 ఆత్మహత్యలు రికార్డవుతున్నాయి.
గుర్తించాలి.. ఆలోచన తుంచాలి..
ఎవరితో కలవకుండా దూరంగా ఉండటం, ఆహారం సరిగ్గా తీసుకోకపోవడం, బతకాలని లేదని అంటుండటం వంటి లక్షణాలను గుర్తించాలి. వారితో మనసువిప్పి మాట్లాడి.. కారణాలు గుర్తించాలి. అవసరమైతే మానసిక నిపుణులను సంప్రదించాలి.
– ఆనంద దివాకర్ (సీనియర్ కౌన్సెలర్)
చావు పరిష్కారం కాదు..
చిన్న సమస్యలకు క్షణికావేశంలో ఆత్మహత్యలు చేసికుని విలువైన జీవితాన్ని కోల్పోతున్నారు. చావు శాశ్వత పరిష్కారం కాదు. మనలో బాధను ఇతరులతో పంచుకుంటే పరిష్కారం దొరుకుతుంది. కుటుంబంలో ఒకరు ఆత్మహత్య చేసుకుంటే ఆ ప్రభావం కుటుంబం మొత్తం మీద ఉంటుందని గుర్తించాలి.
– విద్యారెడ్డి (కౌన్సెలర్)