వివాహం పేరిట మహిళపై అత్యాచారం :వృద్ధుడు అరెస్టు | Oldman Arrest IN Molestation On Woman Tamil Nadu | Sakshi
Sakshi News home page

వివాహం పేరిట మహిళపై అత్యాచారం

Jul 28 2018 8:31 AM | Updated on Jul 28 2018 8:31 AM

Oldman Arrest IN Molestation On Woman Tamil Nadu - Sakshi

టీ.నగర్‌: వివాహం చేసుకుంటానని తెలిపి మహిళపై పలుమార్లు అత్యాచారం జరిపిన వృద్ధుడిని పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. ఈ సంఘటన కూడలూరు సమీపంలో సంచలనం కలిగించింది. వివరాలు.. నీలగిరి జిల్లా, కూడలూరు సమీపంలోగల పందలూరు ప్రాంతానికి చెందిన 40 ఏళ్ల మహిళ అదే ప్రాంతంలో ఉన్న టీ ఎస్టేట్‌లో కార్మికురాలిగా పనిచేస్తున్నది. అదే ఎస్టేట్‌లో నంబియార్‌గుండు ప్రాంతానికి చెందిన సెల్వన్‌ (70) కార్మికుడిగా పనిచేస్తున్నాడు.

ఇలావుండగా అవివాహిత అయిన మహిళపై వృద్ధుడు కన్నేశాడు. ఆమెను వివాహం చేసుకుంటానని తెలిపిన సెల్వన్‌ ఆమెపై అనేక మార్లు అత్యాచారం జరిపాడు. అయితే ఇంతవరకు అతను వివాహం చేసుకోలేదు. అంతేకాకుండా బలవంతంగా ఆమెకు లైంగిక వేధింపులు జరుపుతూ వచ్చాడు. దీనిగురించి సదరు మహిళ తన బంధువులకు తెలిపింది. దీంతో వారు సెల్వన్‌ను మందలించారు.

మందలించినా తీరుమారలేదు..
ఆమె బంధువులు మందలించినా అతని తీరుమారలేదు. సెల్వన్‌ గురువారం రాత్రి మహిళ ఇంటికి వెళ్లి అత్యాచారయత్నం చేశాడు. మహిళ కేకలు వేయడంతో ఇరుగుపొరుగువారు అక్కడికి చేరుకున్నారు. ఈలోపు సెల్వన్‌ అక్కడి నుంచి పరారయ్యాడు. దీంతో మహిళ దేవాలా మహిళా పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న ఇన్‌స్పెక్టర్‌ ఉష శుక్రవారం సెల్వన్‌ను అరెస్టు చేశారు. 

Advertisement
 
Advertisement
Advertisement