చెవి పోగు కోసం హత్య..! | Murder For Ear Ring In Tamil Nadu | Sakshi
Sakshi News home page

చెవి పోగు కోసం హత్య..!

May 29 2018 7:55 AM | Updated on Jul 30 2018 8:41 PM

Murder For Ear Ring In Tamil Nadu - Sakshi

టీ.నగర్‌: చెవి పోగు కోసం స్నేహితుడిని హత్య చేసిన అన్నదమ్ములను పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. ఈ సంఘటన చెంగల్పట్టు సమీపంలో ఆదివారం జరిగింది. వివరాలు.. చెంగల్పట్టు తట్టాన్‌మలై వీధికి చెందిన ఉమాపతి కుమారుడు నవీన్‌ కుమార్‌ (18). ఇతను పదో తరగతి వరకు చదివి స్నేహితులతో కలిసి గంజాయి, మద్యం తరలింపుల్లో పాల్గొంటున్నాడు. ఇతనిపై టౌన్‌ పోలీసు స్టేషన్‌లో ఒక కేసు ఉంది. ఇలా ఉండగా నవీన్‌ కుమార్‌కు తట్టాన్‌మలై వీధి సమీపంలోని కేకే వీధికి చెందిన యువకులతో పాతకక్షలు ఉన్నాయి.

ఆదివారం పెరియనత్తం ముమ్మలై ప్రాంతంలో కాళ్లు చేతులు కట్టిన స్థితిలో నవీన్‌ కుమార్‌ మృతిచెందాడు. పాతక్షల కారణంగా హత్య జరిగి ఉండవచ్చన్న కారణంతో పోలీసులు విచారణ జరిపారు. ఇందు కోసం పోలీసు ప్రత్యేక బృందాలు విచారణ జరిపాయి. దీనికి సంబంధించి అన్నదమ్ములు ప్రవీణ్‌ కుమార్, అబిలను అరెస్టు చేశారు. వారి వద్ద విచారణ జరపగా.. నాలుగు నెలల కిందట నవీన్‌కుమార్‌ వేసుకున్న చెవి పోగును ప్రవీణ్‌ కుమార్‌ అడిగాడు. నవీన్‌కుమార్‌ ఇందుకు వీళ్లేదని తెలిపాడు. రూ.50 చెవి పోగును ఇవ్వడానికి నిరాకరిస్తున్నాడన్న ఆగ్రహంతో తమ్ముడు అబితో చెప్పి ఆవేదన చెందాడు. దీంతో ప్రవీణ్‌ కుమార్, అబి కలిసి నవీన్‌ కుమార్‌ను హత్య చేసినట్లు తెలిసింది. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement