ఏవి సుబ్బారెడ్డి హత్య కుట్రను భగ్నం చేసిన పోలీసులు

Murder Conspiracy To Kill AV Subbareddy Has Destroyed By Police - Sakshi

సాక్షి, వైఎస్సార్‌ కడప : ఏపీ సీడ్స్‌ కార్పొరేషన్‌ మాజీ చైర్మన్‌ ఏవి సుబ్బారెడ్డి హత్య కుట్రను చిన్న చౌక్‌ పోలీసులు భగ్నం చేశారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను కడప డీఎస్పీ సూర్యనారాయణ వెల్లడించారు.. ఏవి సుబ్బారెడ్డిని హతమార్చేందుకు నిందుతులు రూ.50లక్షలకు డీల్‌ కుదుర్చుకున్నట్లు తెలిపారు. నిందితులు ముగ్గురు కర్నూలు జిల్లాకు చెందినవారేనని పేర్కొన్నారు. కడపలో హత్యకు ప్రణాళిక రూపొందిస్తున్న సమయంలో పోలీసులు చాకచక్యంగా అదుపులోకి తీసుకున్నారు.

వీరి నుంచి రూ. 3.20 లక్షల నగదు, ఒక పిస్టల్‌, 6 తూటాలు, రెండు సెల్‌ఫోను స్వాధీనం చేసుకున్నారు. కాగా పోలీసుల ప్రాథమిక విచారణలో నిందితులపై గతంలో పలు కేసులు నమోదు అయినట్లు, సంజురెడ్డి అనే నిందితుడు సూడో నక్సలైట్‌గా తేలింది. ఇప్పటికే రెండుసార్లు సుబ్బారెడ్డి ఇంటిని రెక్కి చేసిన నిందితులు.. ఆ సమయంలో హైదరాబాద్‌ పోలీసులకు బయపడి వెనక్కి వచ్చారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top