
సాక్షి, హైదరాబాద్ : ఎల్‌బీ నగర్ నుంచి ఉప్పల్ వెళ్తున్న కారులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. చైతన్యపురి దాటిన తర్వాత జరిగిన ఈ సంఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదు. షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయని భావిస్తున్నారు. కారులో ఉన్న వారు త్వరగా స్పందించి బయటకు రావడంతో ప్రాణాపాయం తప్పింది. మంటల్లో కారు పూర్తిగా దగ్ధమైంది. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసకుని దర్యాప్తు చేస్తున్నారు.