తల్లీబిడ్డల హత్య | Mother, Daughter Murdered In Visakhapatnam | Sakshi
Sakshi News home page

తల్లీబిడ్డల హత్య

Sep 22 2019 6:55 AM | Updated on Sep 22 2019 2:31 PM

Mother, Daughter Murdered In Visakhapatnam - Sakshi

సాక్షి, పీఎంపాలెం(భీమిలి): కార్‌షెడ్‌ కూడలికి సమీపంలోని ఓ అపార్ట్‌మెంట్‌లో దారుణం చోటుచేసుకుంది. తల్లీ, ఏడాదిన్నర వయసు గల చిన్నారి హత్యకు గురయ్యారు. పీఎం పాలెం సీఐ రవికుమార్‌ తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలోని ఫుడ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియాలో ఉద్యోగిగా పనిచేస్తున్న ఒడిశాలోని రాజ్‌గమ్‌పూర్‌కు చెందిన శుక్రజిత్‌బంజ్‌దేవ్‌ కార్‌షెడ్‌ కూడలికి సమీపంలోని జాహ్నవి ఎన్‌క్లేవ్‌ మొదటి అంతస్తు 101 ప్లాట్‌లో భార్య సువక్షలాదల్‌ సమంత, కూతురు ఎలియానా (18 నెలలు)తో కలసి ఉంటున్నాడు. శనివారం మధ్యాహ్నం 1.30 సమయానికి ఒడిశా రాష్ట్రం కుందనగిరి పోలీస్‌ స్టేషన్‌ నుంచి ఫోన్‌ వచ్చింది. జాహ్నవి ఎన్‌క్లేవ్‌లోని 101 ప్లాట్‌లో తల్లీబిడ్డా మరణించి ఉన్నారని సమాచారం మేరకు పీఎం పాలెం పోలీస్‌ స్టేషన్‌ సీఐ రవికుమార్‌ సిబ్బందితో వెళ్లి అపార్ట్‌మెంట్‌కి వెళ్లారు. అపార్ట్‌మెంట్‌ వాసుల సమక్షంలో 101 గది తలుపునకు వేసిన తాళాలు బలవంతంగా తెరచి చూడగా వంట గదిలో శుక్రజిత్‌ బంజ్‌దేవ్‌ భార్య సువక్షలా దల్‌ సమంత వంట గదిలోనూ ఏడాదిన్నర పాప ఎలియానా బాత్‌రూంలోనూ విగత జీవులుగా పడి ఉన్నారు. పోలీసులకు కుందనగిరి పోలీసులు ఇచ్చిన సమాచారం తప్ప వివరాలు తెలియరాలేదు.

 పీఎస్‌లో ఫిర్యాదుతో వెలుగులోకి విషయం..
ఇదిలా ఉండగా భార్య, కుమార్తెల మరణం గురించి ఒడిశాలోని ఉన్న తన తల్లికి ఫోన్‌ చేసి చెప్పింది భర్తే. వారు స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడం వల్లే ఈ విషయం వెలుగులోకి వచ్చింది. అసలు ఏమైంది అనేది పోలీసులు నిర్ధారించలేకపోతున్నారు. పోలీసులు స్థానికులను విచారించారు. దంపతులు చీటికి మాటికీ గొడవ పడేవారని.. వారు ఒడియా భాషలో మాత్రమే మాట్లాడడం వల్ల ఎందుకు గొడవ పడుతున్నదీ తెలిసేదికాదని అపార్ట్‌మెంట్‌ వాసులు చెప్పారు. ఒడిశా నుంచి మృ తుల కుటుంబ సభ్యులు కార్‌షెడ్‌ ప్రాంతానికి వస్తున్నారు. వారు వస్తే పూర్తి వివరాలు లభ్యం అవుతాయని సీఐ తెలిపారు. శుక్రజిత్‌బంజ్‌దేవ్‌ ఆఖరి సారిగా బుధవారం సాయంత్రం కనిపిం చాడని.. తరువాత కనిపించలేదని స్థానికులు తెలిపారు. జంట మరణాలపై దర్యాప్తు చేస్తున్నామని సీఐ తెలిపారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement