పిల్లలకు విషం ఇచ్చిన తల్లి.. పరిస్థితి విషమం​ | Mother Commits Suicide With Her Childrens In Kamareddy | Sakshi
Sakshi News home page

పిల్లలకు విషం ఇచ్చిన తల్లి.. పరిస్థితి విషమం​

Jun 6 2018 3:59 PM | Updated on Apr 4 2019 4:44 PM

Mother Commits Suicide With Her Childrens In Kamareddy - Sakshi

సాక్షి, కామారెడ్డి : తనతో సహా ముగ్గురు పిల్లలకు విషం ఇచ్చి ఆత్మహత్యాయత్నం చేసింది ఓ తల్లి. ఈ ఘటన బుధవారం కామారెడ్డి జిల్లా గాంధారి మండలం గుర్జల్‌లో చోటుచేసుకుంది. దీంతో ఆ గ్రామంలో విషాద ఛాయాలు అలుముకున్నాయి. వివరాలివి.. సుజాతకు ముగ్గురు సంతానం.. నందిని(7), ధరణి(7 నెలలు), ధనుష్‌ (7 నెలలు) ఇద్దరు కవలలు ఉన్నారు. 

విషయం తెలుసుకున్న కుంటుంబ సభ్యులు వారిని కామారెడ్డిలోని ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. ముగ్గురు పిల్లల పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్‌కు తీసుకెళ్లాలని డాక్టర్లు సూచించారు. దీంతో వారు నగరంలోని ఎల్లారెడ్డిపేట ప్రైవేట్‌ ఆస్పత్రికి పిల్లలను తీసుకొచ్చారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

Advertisement
 
Advertisement
Advertisement