మృతదేహాలై తేలిన తల్లీకుమార్తె | Mother And Daughter Commits Suicide | Sakshi
Sakshi News home page

మృతదేహాలై తేలిన తల్లీకుమార్తె

Apr 7 2018 10:48 AM | Updated on Apr 7 2018 10:48 AM

Mother And Daughter Commits Suicide - Sakshi

చనిపోయింది ఈ బావిలోనే..

త్రిపురాంతకం: అదృశ్యమైన తల్లి,కూమార్తె మృతదేహాలను శుక్రవారం వ్యవసాయ బావిలో గుర్తించారు. వివరాలు.. మండలంలోని మేడపికి చెందిన ఎస్‌కే నాసర్‌బీ (28) తన కుమార్తె సఫియా (10)తో కలిసి గ్రామ సమీపంలోని వ్యవసాయ బావిలో దూకి గురువారం ఆత్మహత్యకు పాల్పడ్డారు. నాసర్‌బీ అత్తగారిది దోర్నాల. భర్త మాబు వేధింపుల కారణంగా వారం క్రితం కుమార్తెతో కలిసి పుట్టింటికి వచ్చింది. భర్త అక్కడకు కూడా వచ్చి వేధిస్తుండటంతో తీవ్ర మనస్తాపం చెందింది. నాసర్‌బీ కుమార్తెతో కలిసి గ్రామ సమీపంలోని వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. నాసర్‌బీ, మాబుకు 13 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి చనిపోయిన కుమార్తెతో పాటు కుమారుడు అక్బర్‌ ఉన్నాడు.బావిలో తొలుత నాసర్‌బీ మృతదేహం లభ్యమైంది. కుమార్తె సఫియా మృతదేహాన్ని ఆ తర్వాత గుర్తించారు. గిద్దలూరు సీఐ శ్రీరామ్, ఎస్‌ఐ కె. కమలాకర్‌లు సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement