breaking news
mother and daughter suicide
-
మృతదేహాలై తేలిన తల్లీకుమార్తె
త్రిపురాంతకం: అదృశ్యమైన తల్లి,కూమార్తె మృతదేహాలను శుక్రవారం వ్యవసాయ బావిలో గుర్తించారు. వివరాలు.. మండలంలోని మేడపికి చెందిన ఎస్కే నాసర్‌బీ (28) తన కుమార్తె సఫియా (10)తో కలిసి గ్రామ సమీపంలోని వ్యవసాయ బావిలో దూకి గురువారం ఆత్మహత్యకు పాల్పడ్డారు. నాసర్‌బీ అత్తగారిది దోర్నాల. భర్త మాబు వేధింపుల కారణంగా వారం క్రితం కుమార్తెతో కలిసి పుట్టింటికి వచ్చింది. భర్త అక్కడకు కూడా వచ్చి వేధిస్తుండటంతో తీవ్ర మనస్తాపం చెందింది. నాసర్‌బీ కుమార్తెతో కలిసి గ్రామ సమీపంలోని వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. నాసర్‌బీ, మాబుకు 13 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి చనిపోయిన కుమార్తెతో పాటు కుమారుడు అక్బర్ ఉన్నాడు.బావిలో తొలుత నాసర్‌బీ మృతదేహం లభ్యమైంది. కుమార్తె సఫియా మృతదేహాన్ని ఆ తర్వాత గుర్తించారు. గిద్దలూరు సీఐ శ్రీరామ్, ఎస్ఐ కె. కమలాకర్‌లు సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. -
ఆస్తి వివాదం..తల్లీకూతుళ్ల ఆత్మహత్య
సిరిసిల్లక్రైం: ఆస్తి వివాదం ఇద్దరి ప్రాణాలను బలితీసుకుంది. ఆస్తి పంపకాల కోసం జరిగిన పంచాయితీలు.. అవమానాలతో తల్లీకూతుళ్లు గుడ్ల విజయ(60), జ్యోతి(30) గురువారం ఆత్మహత్యకు పాల్ప డ్డారు. రాజన్నసిరిసిల్ల జిల్లా కేంద్రానికి చెందిన విజయకు, గుడ్ల విశ్వనాథంతో వివాహమైంది. వీరికి ఇద్ద రు కొడుకులు, ఇద్దరు కూతుళ్లు. అనంతరం వి శ్వనాథం రెండోపెళ్లి చేసుకుని వేరుగా ఉంటున్నాడు. విజయ పెద్దకూతురు హైదరాబాద్‌లో ఉంటుండగా, చిన్నకూతురు జ్యోతికి విడాకులవడంతో ఇంటి వద్దే ఉంటుంది. చిన్నకొడుకు నరేందర్, భార్య వీరితోనే ఉంటున్నారు. పెద్దకొడుకు సిరిసిల్లలోనే వేరే ప్రాంతంలో నివసిస్తున్నాడు. ప్రస్తుతం విజయ ఉంటున్న ఇల్లు, మూడు జోడీల సాంచలు, కండెలు చుట్టే మిషన్ వివాదంగా మారాయి. ఆస్తిపంపకాలలో వివాదం ఇంటిస్థలంతోపాటు మూడు జోడీల సాంచలు పంచుకునే క్రమంలో కుటుంబసభ్యుల మధ్య పంచాయితీలు జరిగాయి. ఈక్రమంలోనే రెండు రోజుల క్రితం విజయ పెద్దకొడుకు ఆమెపై చేయిచేసుకున్నాడు. ఈ అవమానంతోనే ప్రాణాలు తీసుకున్నట్లు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. చనిపోవడానికి రెండు రోజుల ముందే సూసైడ్‌నోట్ రాసిపెట్టుకున్నా రు. తమ చావుకు భర్త విశ్వనాథంతోపాటు పట్టణానికి చెందిన ప్రముఖ రాజకీయ నాయకులే కారణమని అందులో పేర్కొన్నారు. పెద్దకొడుకు అశోక్ అత్తవారిని వదలొద్దని కోరారు. సిరిసిల్ల సీఐ శ్రీనివాస్‌రావు సంఘటన స్థలాన్ని పరిశీలించి దర్యాప్తు చేస్తున్నారు. కొడుకుపై కేసు ఆస్తిని పంచాలంటూ కన్నతల్లి, తోడబుట్టిన చెల్లి చావుకు కారణమైన వ్యక్తిపై సిరిసిల్ల పోలీçసులు కేసు నమోదు చేశారు. సీఐ తెలిపిన వివరాలు. గుడ్ల విజయ(60), జ్యోతి(30)పై రెండు రోజు ల క్రితం గుడ్ల అశోక్ దుర్భాశలాడుతూ చేయిచేసుకున్నాడు. మనస్తాపానికి గురైన తల్లీకూతుళ్లు ఆత్మహత్యకు పాల్పడ్డారు. విజయ చిన్నకొడుకు నరేందర్ ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు. -
అనంతపురం జిల్లాలో విషాదం
పెనుకొండ: అనంతపురం జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. కుటుంబ కలహాలతో తల్లీకూతుళ్లు బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ సంఘటన జిల్లాలోని పెనుకొండ మండలం గుట్టూరులో శుక్రవారం చోటు చేసుకుంది. కుటుంబ కలహాలతో సతమతమవుతున్న తల్లీ కూతుళ్లు వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. విషయం తెలుసుకున్న స్థానికులు మృతదేహాలను వెలికి తీస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలయాల్సి ఉంది.