వివాహిత అనుమానాస్పద మృతి | Married Woman suspicious death in West Godavari | Sakshi
Sakshi News home page

వివాహిత అనుమానాస్పద మృతి

Dec 15 2018 8:09 AM | Updated on Dec 15 2018 8:09 AM

Married Woman suspicious death in West Godavari - Sakshi

మంచంపై విగతజీవిగా పడి ఉన్న తిరుపతమ్మ

పశ్చిమగోదావరి, నరసాపురం: పట్టణంలోని వైఎస్సార్‌ నగర్‌ కాలనీలో శుక్రవారం ఘోరం జరిగింది. వివాహిత తిరుమాని తిరుపతమ్మ(19) అనుమానాస్పదంగా మృతి చెందింది.
తిరుపతమ్మ మృతికి  భర్త వేధింపులే కారణమని భావిస్తున్నారు. టౌన్‌ ఎస్సై కె.చంద్రశేఖర్‌ కథనం ప్రకారం.. పట్టణానికి చెందిన తిరుమాని నానితో తిరుపతమ్మకు గత అక్టోబర్‌ 17న వివాహం జరిగింది. నాని వడ్రంగి పని చేస్తుంటాడు.

శుక్రవారం వైఎస్సార్‌ నగర్‌లో వీరు నివాసం ఉంటున్న ఇంటిలో తిరుపతమ్మ మంచంపై విగతజీవిగా పడి ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఆమె భర్త నాని పరారీలో ఉన్నాడు. దీనిపై ఎస్సై మాట్లాడుతూ ఎలా మృతి చెందింది అనేది పోస్టుమార్టం నివేదిక వచ్చిన తరువాత తెలుస్తుందని చెప్పారు. ఆమె భర్త కోసం గాలిస్తున్నామని వెల్లడించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని చెప్పారు. ఇదిలా ఉంటే ప్రభుత్వాస్పత్రి వద్ద మృతురాలి బంధువులు ఆందోళన చేశారు. తిరుపతమ్మను భర్తే చంపేశాడని, అతనిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. దీంతో ఆస్పత్రి వద్ద  కొంతసేపు ఉద్రిక్తత నెలకొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement