అనుమానాస్పద స్థితిలో వివాహిత మృతి | married Woman Suspicious death in Ananatapur | Sakshi
Sakshi News home page

అనుమానాస్పద స్థితిలో వివాహిత మృతి

Oct 5 2018 12:20 PM | Updated on Oct 5 2018 12:20 PM

married Woman Suspicious death in Ananatapur - Sakshi

మృతిచెందిన షాను

అనంతపురం, తాడిపత్రి: పట్టణంలోని సీబీ రోడ్డులో గురువారం అనుమానాస్పద స్థితిలో ఓ వివాహిత మృతి చెందింది. పోలీసుల వివరాల మేరకు.. టైలర్స్‌కాలనీకి చెందిన షఫీ తన కుమార్తె  షాను(24)ను నాలుగేళ్ల క్రితం పట్టణానికి చెందిన ఇర్ఫాన్‌కు ఇచ్చి వివాహం చేశారు. ఇర్ఫాన్‌ పాత్రికేయ వృత్తిలో కొనసాగుతున్నాడు. వీరిద్దరికీ ముగ్గురు పిల్లలు కలిగినా ఇద్దరు మృతి చెందారు. ఉదయం పొరుగున ఉన్న ఇంటిలో  షాను ఫ్యానుకు ఉరివేసుకుని ఉండడాన్ని గమనించిన స్థానికులు విషయాన్ని భర్తకు తెలియజేశారు. భర్త స్థానికుల సాయంతో ఫ్యాన్‌కు వేలాడుతున్న షాను మృతదేహాన్ని కిందకు దించి పోలీసులకు సమాచారం అందించారు. మృతురాలి కుటుంబీకులు షాను మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మృతురాలి తండ్రి షఫీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement