తొమ్మిది నెలల గర్భిణి నీటి తొట్టెలో పడి.. | Married Woman Died in Water tank In Chittoor | Sakshi
Sakshi News home page

నీటి తొట్టెలో పడి వివాహిత మృతి

Jun 28 2019 11:08 AM | Updated on Jun 28 2019 12:55 PM

Married Woman Lying in Water tank In Chittoor - Sakshi

సాక్షి, వి.కోట(చిత్తూరు) : నీటి టబ్బులో పడి వివాహిత మృతి చెందిన సంఘటన మండలంలో గురువారం చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. కె.కొత్తూరుకు చెందిన ఖలీల్‌ కుమార్తె షబానా(27)ను పలమనేరుకు చెందిన అఫ్రోజ్‌కు ఇచ్చి నాలుగేళ్ల క్రితం వివాహం చేశారు. షబానకు మూర్ఛ వ్యాధి ఉన్నట్లు అత్తవారింటివారు గమనించారు. కొంతకాలంగా ఆమెను పుట్టినింటిలో ఉంచారు. ఈ తరుణంలో గురువారం మధ్యాహ్నం షబానా బాత్‌ రూంలో ఉన్న నీటి టబ్బులో పడి పోయింది. గమనించిన కుటుంబ సభ్యులు ఆమెను వి.కోట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

పరీక్షించిన వైద్యులు ఆమె అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. ప్రస్తుతం షబాన 9 నెలల గర్భిణి. ఆమె మృతితో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. మూర్చవ్యాధి వచ్చి నీటిలో పడి మృతి చెంది ఉంటుందని కుటుంబ సభ్యులు భావిస్తున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పలమనేరుకు తరలించారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ రవిప్రకాష్‌రెడ్డి తెలిపారు. 

Advertisement
 
Advertisement
Advertisement