కుటుంబసభ్యులపై పెట్రోల్‌ పోసి.. దారుణం | Man Set Family Members On Fire In Warangal | Sakshi
Sakshi News home page

కుటుంబసభ్యులపై పెట్రోల్‌ పోసి.. దారుణం

Aug 6 2018 11:00 AM | Updated on Aug 6 2018 11:43 AM

Man Set Family Members On Fire In Warangal - Sakshi

ఘటనలో కాలిపోయిన ఇళ్లు

సాక్షి, వరంగల్‌ రూరల్‌ : దామెర మండలంలో దారుణం చోటుచేసుకుంది. తండ్రి వివాహేతర సంబంధం పెట్టుకున్నాడనే కోపంతో కుటుంబసభ్యులపై పెట్రోల్‌ పోసి నిప్పంటించాడు ఓ కొడుకు. ఈ సంఘటన సోమవారం వరంగల్‌ జిల్లాలోని దామెర మండలంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. వరంగల్‌ జిల్లా దామెర మండలం కంఠాత్మకూరుకు చెందిన కార్తీక్‌ అనే వ్యక్తికి తన తండ్రి కుమార స్వామి వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని తెలిసింది.

దీంతో ఆగ్రహించిన కార్తీక్‌ తండ్రితో సహా ఇతర కుటుంబంసభ్యులపై పెట్రోల్‌ పోసి నిప్పంటించాడు. ఈ ఘటనలో అతడి నానమ్మ రాజ‍మ్మ, తండ్రి కుమార స్వామి, సుజాత అనే మహిళ చనిపోగా మరొకరు గాయపడ్డారు. అనంతరం కార్తీక్‌ పోలీస్‌ స్టేషన్‌లో లొంగిపోయాడు. తండ్రి అక్రమ సంబంధం కారణంగానే ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసులకు వివరించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Advertisement
 
Advertisement
Advertisement