భార్య కాపురానికి రాలేదని.. | Man Attempts Suicide After he was denied by his wife | Sakshi
Sakshi News home page

Mar 25 2018 1:31 PM | Updated on Aug 29 2018 8:38 PM

Man Attempts Suicide After he was denied by his wife - Sakshi

ప్రభుత్వ ఏరియా వైద్యశాలలో చికిత్స పొందుతున్న కొమరగిరి శివ   

సాక్షి, కావలిరూరల్‌: భార్య కాపురానికి రాలేదని మనస్థాపంతో ఓ యువకుడు గొంతు కోసుకుని ఆత్మహత్యాయత్నంకు పాల్పడ్డాడు. ఈ ఘటన శనివారం జరిగింది. స్థానిక కొనదిన్నె గిరిజనకాలనీకి చెందిన కొమరగిరి శివ దంపతుల మధ్య మనస్పర్థలు రావడంతో ఆమె పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్‌ వెనుక ఉన్న సాయిబాబా మందిరం వద్ద ఉంటుంది. శనివారం భార్య వద్దకు వచ్చి ఆమెను కాపురానికి రమ్మని పిలవగా నిరాకరించింది. దీంతో మనస్థాపానికి గురైన శివ సమీపంలో ఉన్న బ్లేడును తీసుకుని గొంతు కోసుకున్నాడు. స్థానికులు అతన్ని అడ్డుకుని 108కు సమాచారమిచ్చారు. పైలెట్‌ అబ్దుల్‌ జబ్బార్, ఈఎంటీ సలీంఖాన్‌ క్షతగాత్రుడిని ప్రభుత్వ ఏరియా వైద్యశాలకు తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement