breaking news
kavali hospital
-
భార్య కాపురానికి రాలేదని..
సాక్షి, కావలిరూరల్: భార్య కాపురానికి రాలేదని మనస్థాపంతో ఓ యువకుడు గొంతు కోసుకుని ఆత్మహత్యాయత్నంకు పాల్పడ్డాడు. ఈ ఘటన శనివారం జరిగింది. స్థానిక కొనదిన్నె గిరిజనకాలనీకి చెందిన కొమరగిరి శివ దంపతుల మధ్య మనస్పర్థలు రావడంతో ఆమె పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ వెనుక ఉన్న సాయిబాబా మందిరం వద్ద ఉంటుంది. శనివారం భార్య వద్దకు వచ్చి ఆమెను కాపురానికి రమ్మని పిలవగా నిరాకరించింది. దీంతో మనస్థాపానికి గురైన శివ సమీపంలో ఉన్న బ్లేడును తీసుకుని గొంతు కోసుకున్నాడు. స్థానికులు అతన్ని అడ్డుకుని 108కు సమాచారమిచ్చారు. పైలెట్ అబ్దుల్ జబ్బార్, ఈఎంటీ సలీంఖాన్ క్షతగాత్రుడిని ప్రభుత్వ ఏరియా వైద్యశాలకు తరలించారు. -
ప్రభుత్వ వైద్యుల నిర్లక్ష్యం
-
ప్రభుత్వ వైద్యుల నిర్లక్ష్యం
నెల్లూరు: కావలి ప్రభుత్వ వైద్యుల నిర్వాకం ఓ బాలుడి ప్రాణం మీదకు తెచ్చింది. జ్వరంతో బాధపడుతున్న బాలుడిపట్ల వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరించి అతడికి ఇంజక్షన్ చేయడంతో బ్లడ్ క్లాట్ అయ్యి ఇన్ ఫెక్షన్ రావడంతో ఆపరేషన్ చేయాలని వైద్యులు సూచించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం నెల్లూరుకు తీసుకెళ్లాలని సూచించారు. దీంతో కావలి ప్రభుత్వాస్పత్రి వద్ద బంధువులు ఆందోళన నిర్వహించారు.