మద్యం మత్తు.. తల్లిని తుపాకీతో కాల్చి | Man Assassinated Mother With Pistol In delhi | Sakshi
Sakshi News home page

మద్యం మత్తు.. తల్లిని తుపాకీతో కాల్చి

Jul 4 2020 10:56 AM | Updated on Jul 4 2020 5:12 PM

Man Assassinated Mother With Pistol In delhi - Sakshi

న్యూఢిల్లీ : మద్యం మత్తులో ఓ యువకుడు తల్లిని హతమార్చిన ఘటన దేశ రాజధానిలో చోటుచేసుకుంది. ఢిల్లీలోని బవానా ప్రాంతంలో సూరజ్‌ అనే 26 ఏళ్ల యువకుడు డ్రైవర్‌గా పనిచేస్తూ తన తల్లితో(60) కలిసి జీవిస్తున్నాడు. ఈ క్రమంలో గురువారం అర్ధరాత్రి తప్పతాగి ఇంటికి చేరుకున్న యువకుడు ఓ విషయంపై తల్లితో వాగ్వాదానికి దిగాడు. నోటికి వచ్చినట్లు దుర్భాషలాడుతూ.. తల్లిపై చేయి చేసుకున్నాడు. అనంతరం తాగిన మత్తులో తల్లిని పిస్తోల్‌తో నిర్ధాక్షిణ్యంగా కాల్చాడు. మహిళకు ఎడమ కంటికి తీవ్రంగా గాయపడటంతో స్థానికులు ఆస్పత్రికి తరలించారు. కాగా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బాధితురాలు మరణించినట్లు వైద్యులు తెలిపారు. ఇక  ఈ విషయంపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. అతని నుంచి పిస్తోల్‌ను స్వాధీనం చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. (మామ ఉద్యోగం కోసం బావమరిదిపై..)

చదవండి: ఢిల్లీలో భూప్రకంపనలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement