సెల్‌ఫోన్‌ చోరీకి యత్నం

Man Arrest in Cellphone Robbery Case Visakhapatnam - Sakshi

స్థానికులకు చిక్కిన యువకుడు

విశాఖపట్నం, బుచ్చెయ్యపేట(చోడవరం):  మండలంలో విజయరామరాజుపేట గ్రామం వద్ద   సెల్‌ ఫోన్‌ లాక్కొని బైక్‌పై ఊడాయిం చేందుకు యత్నించిన యువకుడిని బాధితుడే పట్టుకుని బుచ్చెయ్యపేట పోలీసులకు అప్పగించాడు. పి భీమవ రం గ్రామానికి చెందిన  అనిమిరెడ్డి నూకరాజు అనే యువకుడు మంగళవా రం ఉదయం సైకిల్‌పై చోడవరం వెళ్లి సాయంత్రం తిరుగు ప్రయాణమయ్యా డు. విజయరామరాజుపేట గ్రామం వద్ద పల్సర్‌ బైక్‌పై వచ్చిన ముగ్గురు యువకులు రావికమతం ఎంత దూరం ఉంటుందని నూకరాజుతో మాటలు కలుపుతూ అతని చేతిలో సెల్‌ఫోన్‌ లాక్కొని ఉడాయించడానికి ప్రయత్నిం చారు. 

దీంతో వెంటనే తేరుకున్న నూకరాజు ద్విచక్ర వాహనంపై వెనక కూర్చు న్న మూడో  వ్యక్తి చొక్కా కాలర్‌ పట్టుకుని గట్టిగా లాగడంతో ద్విచక్ర వాహనంతో పాటు ముగ్గురూ కింద పడిపోయారు. వెంటనే అక్కడికి సమీపంలో ఉన్నవారు రావడంతో ద్విచక్ర వాహ నాన్ని వదిలి ఇద్దరు పారిపోయారు. నూకరాజు మాత్రం కాలర్‌ పట్టుకున్న వ్యక్తిని వదలక పోవడంతో స్థానికులు అతనిని పట్టుకున్నారు. బుచ్చెయ్యపేట పోలీసులకు సమాచారం అందించడంతో ఏఎస్‌ఐ పాండు వచ్చి బైక్‌ను,సెల్‌ ఫోన్‌ దొంగతనం చేయబోయిన వ్యక్తిని స్టేషన్‌కు తరలించారు. పట్టుబడిన వ్యక్తి మాడుగులకు చెందిన మేకల దావిద్‌ కాగా,  పారిపోయిన ఇద్దరు రాము,కుమార్‌లుగా పోలీసులు గుర్తించారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top