యువతీయువకుల ఆత్మహత్య | Lovers Suicide In Nizamabad | Sakshi
Sakshi News home page

యువతీయువకుల ఆత్మహత్య

May 22 2019 12:11 PM | Updated on May 22 2019 12:11 PM

Lovers Suicide In Nizamabad - Sakshi

మృతిచెందిన గుర్తు తెలియని యువకుడు, యువతి మృతదేహలు

నిజామాబాద్‌ సిటీ(నిజామాబాద్‌అర్బన్‌): ప్రేమ జంటగా భావిస్తున్న యువతీయువకులు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న ఘటన నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. నగరంలోని కంఠేశ్వర్‌ రైల్వే కమాన్‌ ప్రాంతంలోని సోని ఫంక్షన్‌హాల్‌ (ఎల్లమ్మగుట్ట) వద్ద మంగళవారం తెల్లవారుజామున రైలు పట్టాలపై యువతి, యువకుడి మృత దేహాలను గుర్తించిన రైలు కో పైలట్‌  రైల్వే పోలీసులకు సమాచారం అందించారు.  రైల్వే ఎస్సై ప్రణయ్‌కుమార్‌ ఉదయం 4 గంటల ప్రాంతంలో సిబ్బందితో కలిసి ఘటన స్థలానికి వెళ్లి పరిశీలించారు.

యువకుడికి 23, యువతికి 20 సంవత్సరాలు వయస్సు ఉండొచ్చని ఎస్సై పేర్కొన్నారు. అయితే ఘటన స్థలంలో మృతుల వద్ద ఎలాంటి ఆధారాలు లభించలేదు. మృతదేహాలకు సమీపంలో సెల్‌ఫోన్‌ పడిఉన్నప్పటికీ అందులో అందులో  సిమ్‌కార్డు లేదు. మృతదేహాలను జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి తరలించారు. మృతుల ఆచూకీ కోసం ఫొటోలను సివిల్‌ పోలీసులకు పంపించారు. ఎలాంటి సమాచారం లేకపోవడంతో గుర్తు తెలియని వ్యక్తులుగా కేసు నమోదు చేశారు. మృతులు ప్రేమజంట అయి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement