బాలుడి కాలుకు వైరు: 2కి.మీ ఈడ్చుకెళ్లిన లారీ

Lorry Driver Negligence Boy Life Dangerous Position In Warangal - Sakshi

సాక్షి, వరంగల్‌ రూరల్‌ : జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. లారీ డ్రైవర్‌ నిర్లక్ష్యం కారణంగా ఓ బాలుడి ప్రాణాలు ప్రమాదంలో పడ్డాయి. ఈ సంఘటన నడికూడా మండల కేంద్రంలో శుక్రవారం చోటుచేసుకుంది. పత్తి గింజల లోడ్‌తో వెళ్తున్న లారీని డ్రైవర్‌ అజాగ్రత్తగా నడపటంతో రోడ్డు ప్రక్కన ఉన్న విద్యుత్ వైర్లకు తగిలింది. దీంతో విద్యుత్ వైర్లు తెగి లారీకి చుట్టుకున్నాయి. ఈ నేపథ్యంలో రోడ్‌పై నడిచి వెళ్తున్న మిట్టి రాజు అనే 12 సంవత్సరాల బాలుడి కాలుకు సైతం లారికి చుట్టుకున్న వైరు పెనవేసుకుంది. అలా లారీ బాలుడ్ని 2 కిలో మీటర్ల దూరం వరకు లాక్కెళ్లింది. ఇది గమనించిన గ్రామస్తులు బైకుల సహాయంతో లారీని అడ్డగించారు. ఈ ప్రమాదంలో బాలుడికి తీవ్ర గాయాలయ్యాయి. అతడ్ని వెంటనే వరంగల్ ఎంజీఎంకు తరలించారు. ప్రస్తుతం బాలుడి పరిస్థితి విషమంగా ఉంది. సంఘటన స్థలానికి చేరుకున్న ఎస్ఐ వెంకట కృష్ణ విచారణ జరుపుతున్నారు. 

చదవండి : ముఖానికి నల్లరంగు: మెడలో చెప్పుల దండ..

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top