ముఖానికి నల్లరంగు: మెడలో చెప్పుల దండ.. | Elderly Man Paraded With Garland Of Shoes In Uttar Pradesh | Sakshi
Sakshi News home page

లైంగిక వేధింపులు: చెప్పుల దండ మెడలో వేసి..

May 22 2020 5:52 PM | Updated on May 22 2020 6:33 PM

Elderly Man Paraded With Garland Of Shoes In Uttar Pradesh - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

తన తండ్రిని కొట్టుకుంటూ తీసుకుపోయారని, ముఖానికి నల్లరంగు, మెడలో చెప్పుల దండ...

లక్నో : మహిళను లైంగికంగా వేధింపులకు గురిచేశాడని ముఖానికి నల్లరంగుపూసి, మెడలో చెప్పుల దండవేసి ఊరేగించారు మహిళ కుటుంబసభ్యులు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్‌లోని కాశ్‌గంజ్‌లో గురువారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. కాశ్‌గంజ్‌ జిల్లా అలిదాన్‌పూర్‌కు చెందిన 69 ఏళ్ల  వృద్ధుడు పొరిగింటి మహిళను లైంగికంగా వేధించాడు. దీంతో మహిళ కుటుంబసభ్యులు అతడి మెడలో చెప్పుల దండవేసి, ఊరంతా ఊరేగించారు. అయితే ఈ ఘటనకు సంబంధించి ఇరువర్గాల వారు ఒకరిపై ఒకరు సహావర్‌ పోలీస్‌ స్టేషన్లో ఫిర్యాదు చేసుకున్నారు. మొదట బాధితుడి కుమారుడు పోలీసులను ఆశ్రయించాడు. ( దొంగ చేతివాటం: ఏకంగా ఆర్టీసీ బస్సునే..)

ఆయుధాలతో ఇంట్లోకి ప్రవేశించిన ఐదుగురు తన తండ్రిని కొట్టుకుంటూ తీసుకుపోయారని, ముఖానికి నల్లరంగు, మెడలో చెప్పుల దండ వేసి ఊరేగించారని తెలిపాడు. స్థల వివాదం కారణంగానే దాడికి పాల్పడినట్లు పేర్కొన్నాడు. దీంతో పోలీసులు ముగ్గురు వ్యక్తుల్ని అదుపులోకి తీసుకున్నారు. అరెస్టయిన ముగ్గురిలో ఓ వ్యక్తి.. ఫిర్యాదు దారుడి తండ్రి తన భార్యను లైంగికంగా వేధించాడని కంప్లైట్‌ ఇచ్చాడు. ఇరు పక్షాల ఫిర్యాదు మేరకు కేసులు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
( ఖైనీ అమ్మనందుకు ఇంటిపై కాల్పులు )

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement