లా విద్యార్థి బలవన్మరణం | Law Student Commits Suicide in Kurnool | Sakshi
Sakshi News home page

లా విద్యార్థి బలవన్మరణం

Feb 2 2019 1:18 PM | Updated on Feb 2 2019 1:18 PM

Law Student Commits Suicide in Kurnool - Sakshi

రమేష్‌రెడ్డి మృతదేహం

కర్నూలు, శిరివెళ్ల: కడుపునొప్పి తాళలేక లా విద్యార్థి ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఎస్‌ఐ తిమ్మారెడ్డి తెలిపిన వివరాలు..మండల పరిధిలోని  గోవిందపల్లెకు చెందిన గంగదాసరి చిన్న ఓబుల కొండారెడ్డి కుమారుడు రమేష్‌ రెడ్డి (21) జిల్లా కేంద్రంలోని ప్రసూన లా కళాశాలలో ఎల్‌ఎల్‌బీ చదువుతున్నాడు. కొంతకాలంగా కడుపునొప్పితో బాధ పడుతున్నాడు. ఈ క్రమంలో శుక్రవారం బంద్‌ ఉండటంతో కళాశాలకు వెళ్లకుండా ఇంటి వద్దే ఉన్నాడు. కుటుంబ సభ్యులు పనులకు వెళ్లిన తర్వాత వరండా పైకప్పునకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. పోస్ట్‌మార్టం నిమిత్తం మృత దేహాన్ని నంద్యాల ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement