కేంద్ర హోంశాఖ సహాయ మంత్రికి బెదిరింపు కాల్స్‌ | Kishan Reddy Gets Unknown Threat Calls | Sakshi
Sakshi News home page

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రికి బెదిరింపు కాల్స్‌

Jun 14 2019 11:00 AM | Updated on Jun 14 2019 11:42 AM

Kishan Reddy Gets Unknown Threat Calls - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : కేంద్ర హోం శాఖ సహాయ మంత్రిగా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన గంగాపురం కిషన్‌ రెడ్డిని చంపేస్తామంటూ గుర్తు తెలియని వ్యక్తులు బెదిరిస్తున్నారు. కిషన్‌ రెడ్డికి బెదిరింపు కాల్స్‌ రావడంపై సైబర్‌ క్రైమ్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. ఎవరో అజ్ఞాతవ్యక్తులు మంత్రికి ఫోన్‌ చేసి.. చంపుతామని బెదిరించారంటూ కిషన్‌ రెడ్డి ఫిర్యాదులో పేర్కొన్నారు. గత నెల 20న ఇంటర్‌నెట్‌ వాయిస్‌కాల్స్‌ ద్వారా దుండగులు బెదిరింపులకు పాల్పడ్డారని తెలిపారు. ఈ నేపథ్యంలో కిషన్‌రెడ్డి ఇంటివద్ద భద్రతా బలగాల సంఖ్యను పెంచి నిఘా పటిష్టం చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement