కుటుంబంతో సహా బీజేపీ నాయకుడి దారుణ హత్య | Jharkhand BJP Leader Shot Dead Along With Family | Sakshi
Sakshi News home page

కుటుంబంతో సహా బీజేపీ నాయకుడి దారుణ హత్య

Jul 23 2019 8:46 PM | Updated on Jul 23 2019 8:53 PM

Jharkhand BJP Leader  Shot Dead Along With Family - Sakshi

రాంచీ : బీజేపీ నాయకుడు, అతని కుటుంబ సభ్యులు గుర్తు తెలియని వ్యక్తుల చేతిలో దారుణహత్యకు గురయ్యారు. ఈ ఘటన జార్ఖండ్‌లోని ఖుంతి జిల్లాలో చోటు చేసుకుంది. వివరాలు.. బీజేపీ నాయకుడు మాగో ముండా సోమవారం రాత్రి ఇంటి దగ్గర కుటుంబంతో కలిసి కూర్చొని ఉండగా గుర్తు తెలియని దుండగులు వచ్చి వారిపై కాల్పులు జరిపినట్లు పోలీసులు తెలిపారు. ఈ కాల్పుల్లో మాగో, అతని భార్య లక్మణి, కొడుకు లిప్రాయి అక్కడిక్కడే మరణించారని పోలీసులు వెల్లడించారు. ఈ దాడిలో మరో మహిళ  తీవ్రంగా గాయపడటంతో ఆమెను రాంచీలోని రాజేంద్ర ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్స్‌కు తరలించామని తెలిపారు. ప్రస్తుతం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తునట్లు వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement