యువతి కళ్లలో కారం చల్లి నగలు దోపిడీ | Jewellery Robbery In Chittoor | Sakshi
Sakshi News home page

యువతి కళ్లలో కారం చల్లి నగలు దోపిడీ

May 12 2018 8:24 AM | Updated on Aug 3 2018 3:04 PM

Jewellery Robbery In Chittoor - Sakshi

సంఘటనా స్థలాన్ని పరిశీలిస్తున్న ఎస్‌ఐ వెంకటేశ్వర్లు

చిత్తూర్, పాకాల: మండల కేంద్రమైన పాకాలలో శుక్రవారం మధ్యాహ్నం దుండగులు యువతి కళ్లలో కారం చల్లి నగలు దోపిడీ చేశారు. పోలీసుల కథనం మేరకు.. స్థానిక గాంధీనగర్‌కు చెందిన దిలీప్‌ చక్రవర్తి భార్య స్వాతిప్రియ ద్విచక్ర వాహనంలో రైల్వే క్వార్టర్స్‌లో ఉన్న  కోదండరామాలయానికి వెళ్లింది.

పూజలు చేసుకుని ఇంటికి వెళుతుండగా మార్గమధ్యంలో ఇద్దరు దుండగులు ఆమెను అడ్డగించి కళ్లలో కారం చల్లారు. ఆమె ఒంటిపై ఉన్న 208 గ్రాముల బంగారు నగలను లాక్కుని ఉడాయించారు. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ సమయంలో అక్కడ తనను అడ్డగించిన ఇద్దరితోపాటు మరో ఆరుగురు తెలియని వ్యక్తులు ఉన్నారని పేర్కొంది.  ఎస్‌ఐ వెంకటేశ్వర్లు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. దర్యాప్తు చేస్తామని పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement