భర్త కాదు కిరాతకుడు | Husband Killed Pregnent Wife In Karnataka | Sakshi
Sakshi News home page

భర్త కాదు కిరాతకుడు

Jul 26 2018 10:28 AM | Updated on Jul 30 2018 8:41 PM

Husband Killed Pregnent Wife In Karnataka - Sakshi

శశికళ, సత్యరాజ్‌(ఫైల్‌)

బనశంకరి : ఆరు నెలల గర్భిణిని గొంతుకోసి హత్య చేసిన కిరాతక భర్త ఉదంతం ఆలస్యంగా వెలుగు చూసింది. హంతకుడిని అరెస్ట్‌ చేసిన పోలీసులు..హత్యోదతం వివరాలను బుధవారం మీడియాకు వివరించారు.  తమిళనాడుకు చెందిన సత్యరాజ్‌కు  నగరంలోని దొరసాని పాళ్యకు చెందిన శశికళతో 6 నెలల క్రితం వివాహమైంది. దంపతులు దొరసానిపాళ్యలోని బంధువుల ఇంట్లో ఉండేవారు. అయితే ఉమ్మడి కుటుంబంలో ఉండలేనని, అద్దె ఇంటికి మారాలని శశికళ డిమాండ్‌ చేస్తూ గొడవపడేది.

ఇటీవల  గర్భం దాల్చిన ఆమె భర్తతో నిత్యం గొడవపడేది. దీంతో  భార్యను హత్యచేయాలని సత్యరాజ్‌ పథకం రచించాడు. మూడురోజుల  క్రితం తిప్పగొండనహళ్లి జలాశయం వద్దకు తీసుకెళ్లాడు. నిర్జన ప్రదేశంలో శశికళను కత్తితో గొంతుకోసి హత్య చేశాడు. మృతదేహాన్ని అటవీప్రదేశంలో పడేశాడు. తదనంతరం నగరానికి చేరుకొని   శశికళ సెల్‌ తీసుకొని భార్యను బంధువుల ఇంటివద్ద  వదిలిపెట్టి వెళుతున్నానని చెప్పి మెసేజ్‌ చేశాడు. అనంతరం పుట్టేనహళ్లి పోలీస్‌స్టేషన్‌లో తన భార్య కనిపించలేదంటూ పిర్యాదు చేసి నాటకమాడాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు  సత్యరాజ్‌ ను అదుపులోకి తీసుకుని తమదైనశైలిలో విచారణ చేపట్టగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో నిందితుడిని అరెస్ట్‌ చేసి విచారణ చేపట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement